Happy Birth Day MS DHONI : భారతీయులు ఒక మనిషిని ఆరాధిస్తే.. ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే అనేక సందర్భాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా దక్షిణ భారత దేశంలో ప్రజల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మనిషిని ఆరాధిస్తే.. చనిపోయేంతవరకు ఆ వ్యక్తిని గుండెల్లో ఉంచుకొని అభిమానిస్తూనే ఉంటారు. ఇదివరకు ఓ సినిమాలో కూడా ” తెలుగు ప్రజలు ఓ మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా..” అంటూ ఉండే డైలాగ్ గుర్తు ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగ్ ను నిజం చేసేలా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని విషయంలో తెలుగు అభిమానులు నిరూపించుకున్నారు. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు సినిమా హీరోలు అలాగే రాజకీయ నాయకులను ఎక్కువగా అభిమానిస్తారన్న సంగతి తెలిసిందే. వీరి తర్వాత టీమ్ ఇండియా క్రికెటర్లకి ఆస్థానం దక్కుతుంది. అలాంటి టీమిండియా స్టార్ మహేంద్రసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమ్ ఇండియా ఎన్నాళ్ళ నుండి ఎదురుచూస్తున్న అనేక ఐసీసీ కప్పులను టీమిండియాకు అందించిన ఏకైక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.
Kerala : కేరళలో మరో చిన్నారికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
అలాంటి వ్యక్తికి అభిమానులు కోకొల్లలు. అంతర్జాతీయ క్రికెట్ నుండి మహేంద్రసింగ్ ధోని ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించిన.. ఇప్పటికి అతనిపై దేశంలోని చాలామంది ప్రజలు ఇంకా అభిమానిస్తూనే ఉన్నారు. నేడు ధోని పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ లో తెలుగు ధోని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 100 అడుగుల భారీ కట్ అవుట్ ను ఏర్పాటు చేశారు. ధోని బర్త్ డే కు ఒక రోజు ముందే ఈ కటౌట్ ను ఆవిష్కరించారు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలో అందించిన ఏకైక కెప్టెన్ గా రికార్డు ఎక్కిన మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజును అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.
Hot vs Cold Water For Bathing : స్నానం చేయడానికి వేడి నీరు మంచిదా లేక చల్లని నీరా..?
జూలై 7 వచ్చిందంటే చాలు టీమిండియా అభిమానులు పెద్ద ఎత్తున ధోని పుట్టినరోజు సందర్భంగా జరుపుకున్న కార్యక్రమాలు అనేకం. తాజాగా టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్న భారత్ క్రికెట్ అభిమానులకు ఈ భారీ కటౌట్ మరింత ఉత్సాహాన్ని ఇవ్వనుంది. దీనికి కారణం ఇండియాకు మొదటి టి20 వరల్డ్ కప్ అందజేసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే. అప్పుడప్పుడే కొత్తగా టి20 లకు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న మహేంద్రసింగ్ ధోని టీం అద్భుతంగా నడిపించి మొదటిసారిగా జరిగిన టి20 వరల్డ్ కప్ ను ఇండియాకు అందించాడు. 2007లో సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత.. 2011లో వన్డే వరల్డ్ కప్, ఆ తర్వాత 2013లో ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన కెప్టెన్గా మహేంద్రసింగ్ ధోని రికార్డుల ఎక్కాడు. ఇలాంటి వ్యక్తికి తెలుగు క్రికెట్ అభిమానులు 100 అడుగుల కటౌట్ పెట్టి గౌరవించడం నిజంగా హర్షనీయకమైనదే.
100 FEET CUT-OUT OF MS DHONI BY TELUGU FANS. 🥶
– Birthday celebration begins for Thala…!!!! pic.twitter.com/QatZw2Jb7Q
— Johns. (@CricCrazyJohns) July 6, 2024