NTV Telugu Site icon

Viral: మండే ఎండలో ఒంటే దాహం తీర్చిన లారీ డ్రైవర్..

Camel

Camel

భగభగమండే వేడిలో శరీరానికి నీరు చాలా అవసరం. గొంతు ఎండిపోతుంటే.. మనిషి అయినా.. జంతువు అయినా నీరు లేకపోతే జీవించడం కష్టమవుతుంది. అయితే తాజాగా దాహంతో బాధపడుతున్న ఒంటె నీరు లేకపోవడంతో రోడ్డు పక్కన కదలకుండా పడి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అప్పుడే ఒక వ్యక్తి దేవుడిలాగా వచ్చి బాటిల్ తో నీళ్ళు అందించి ఆ ఒంటెకు ప్రాణం పోశాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.

Also Read : iPhone 15 Launch: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 లాంచ్ డేట్ అప్పుడే! ధర, ఫీచర్ల వివరాలు ఇవే

దాహంతో బాధపడుతున్న ఒంటె తన చివరి శ్వాసలను లెక్కిస్తోంది.. కానీ అప్పుడు దయగల ఓ వ్యక్తి .. తన చేతులతో నీరందించి..ఆ జీవికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు అని ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా అన్నాడు. భావోద్వేగ క్లిప్‌ను చూసిన తర్వాత.. దేశం ప్రస్తుతం తీవ్రమైన వేడి వేవ్‌లో ఉందని IFS ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొన్ని నీటి చుక్కలు ఒకరి జీవితాన్ని కాపాడతాయని పేర్కొన్నారు.

Also Read : Top Headlines@9AM: టాప్‌ న్యూస్

రోడ్డు పక్కన నీతెనంగా పడుకొని ఉన్న ఒంటెను చూసి దానికి అటుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ వాటర్ బాటిల్ లో నీళ్లు ఇవ్వడంతో ఆ ఒంటె శక్తి తిరిగి తెచ్చుకుంది. కొన్ని సెకన్లలో డ్రైవర్ ఒంటె ప్రాణాన్ని కాపాడాడు. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఇప్పుడు డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. జూన్ 11న పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో దీనికి 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇది కాకుండా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.