Site icon NTV Telugu

Monkey Man : ఆకట్టుకుంటున్న ‘మంకీ మ్యాన్’ ట్రైలర్..

Whatsapp Image 2024 01 27 At 11.35.39 Am

Whatsapp Image 2024 01 27 At 11.35.39 Am

ఒక సాధారణ మనిషికి సూపర్ పవర్స్ వచ్చి ప్రజలను కాపాడాలి అనుకుంటే ఎలా ఉంటుందో ‘హనుమాన్’ సినిమాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ చూపించాడు.దాదాపు అలాంటి తరహా కథతోనే హాలీవుడ్ చిత్రం ‘మంకీ మ్యాన్’ కూడా తెరకెక్కిందని రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ చిత్ర ట్రైలర్ చుస్తే తెలుస్తుంది.. దేవ్ పటేల్ నటిస్తూ దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. పేదవారిని కాపాడే హీరోగా తనను తాను భావిస్తూ హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లే హీరో కథ ఇది. మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని ట్రైలర్తో క్లారిటీ ఇచ్చాడు దేవ్ పటేల్.గత రెండేళ్లుగా ‘మంకీ మ్యాన్’ చిత్రీకరణ సాగుతోంది. దేవ్ పటేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు స్టోరీ మరియు స్క్రీన్ ప్లే కూడా తానే ప్లాన్ చేసుకున్నాడు.

‘నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది’’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ తో ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అదే సమయంలో బ్యాక్గ్రౌండ్ లో హనుమంతుడి ఫోటోలు కూడా కనిపిస్తాయి. ‘‘రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. ది వైట్ మంకీ అని ‘మంకీ మ్యాన్’ సారాంశాన్ని ఒక డైలాగుతో చెప్పేశాడు హీరో. పెద్ద సిటీలో పేద ప్రజలను ఎవరూ పట్టించుకోరని, అలాంటి వారికి గుర్తింపు కోసం ఫైట్ చేస్తానని దేవ్ పటేల్ ముందుకు వస్తాడు. అదంతా తాను ఎలా చేస్తాడు అనేదే ఈ మూవీ అసలు కథ అని మేకర్స్ ట్రైలర్లో స్పష్టం చేశారు.‘మంకీ మ్యాన్’ మూవీలో దేవ్ పటేల్ సరసన శోభితా దూళిపాళ నటిస్తోంది. ఇందులో హీరో ఒక వెయిటర్ పాత్రలో కనిపించగా.. శోభితా బార్ డ్యాన్సర్ గా మెప్పించనుంది. ఇక ఈ మూవీలో మెయిన్ విలన్స్ గా మకరంద్ దేశ్పాండేతో పాటు సిఖందర్ ఖేర్ కూడా కనిపించనున్నారు. ఇందులో మకరంద్.. ఒక స్వామిజీ పాత్రను పోషిస్తున్నట్టు ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాకు దేవ్ పటేల్ దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇతర నిర్మాతలతో కలిసి తాను కూడా సినిమా ప్రొడక్షన్ లో భాగస్వామి అయ్యాడు. యూనివర్సల్ పిక్చర్స్ బ్యానర్ ‘మంకీ మ్యాన్’ మూవీను ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది.

Exit mobile version