SL Vs PAK: 64 బంతుల్లో విధ్వంసం.. ఎవరూ ఊహించని రేంజ్ క్లైమాక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక మహిళా క్రికెటర్ ఇమేషా దులాని అద్భుతమైన శతకంతో సంచలనం సృష్టించింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె శ్రీలంక జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తరఫున సెంచరీ చేసిన రెండో మహిళా బ్యాటర్‌గా దులాని నిలిచింది. అంతకుముందు 2019లో ఆస్ట్రేలియాపై చామరి అటపట్టు శ్రీలంక తరఫున తొలి సెంచరీ సాధించగా, దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత దులాని (64 బంతుల్లో 101 నాటౌట్) ఈ ఘనత సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో షవాల్ జుల్ఫికర్ 61 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ మునీబా అలీ 42 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్హారి రెండు వికెట్లు తీయగా, కావ్య కవింది, సుగంధిక కుమారి, చాముడి ప్రబోధ తలొక వికెట్ పడగొట్టారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఓపెనర్లు ఇమేషా దులాని, కెప్టెన్ చామరి అటపట్టు మొదటి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యంతో మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. నాశ్రా సంధూ బౌలింగ్‌లో అటపట్టు (39) అవుట్ అయిన తర్వాత, విశిమి గుణరత్నె (3), హర్షిత సమరవిక్రమ (7), కవిషా దిల్హారి (11) త్వరత్వరగానే నిష్క్రమించారు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా దులాని మాత్రం క్రీజులో నిలకడగా ఆడుతూ పాకిస్థాన్ బౌలర్లను ఎదుర్కొంది. ఆమె తన ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 101 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. 19వ ఓవర్ చివరి బంతికి శ్రీలంక విజయాన్ని ఖాయం చేసుకుంది. పాకిస్థాన్ బౌలర్లలో నాశ్రా సంధూ రెండు వికెట్లు పడగొట్టింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..