Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Bay Of Bengal Low Pressure

Bay Of Bengal Low Pressure

Low Pressure in Bay of Bengal: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం (నవంబర్ 14) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నవంబర్ 16 నాటికి వాయుగుండంగా బలపడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Also Read: Guvvala Balaraju: మరోసారి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి

×
×
Ad

మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మంగళవారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.