IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD October 2026 Forecast: భారత వాతావరణ శాఖ (IMD) అక్టోబర్ నెల వాతావరణ అంచనాలను (ఆవుట్‌లుక్) విడుదల చేసింది. ఈ అంచనాల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌లోనూ వర్ష సూచనలు పెద్దగా లేవు. దీనివల్ల సాధారణంగా చల్లబడాల్సిన అక్టోబర్ నెల ఈసారి ఎండకాలాన్ని తలపించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రాల్లో తలెత్తుతున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంపై బలమైన ఎల్ నినో (El Niño) పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎల్ నినో పరిస్థితులు ఈ సంవత్సరాంతం వరకు మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, హిందూ మహాసముద్రంపై ప్రస్తుతం తటస్థ ఐఓడీ (Indian Ocean Dipole – IOD) పరిస్థితులు ఉన్నాయని, రాబోయే ఈశాన్య రుతుపవనాల కాలంలో కూడా ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ సముద్ర వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగే శీతాకాలం ప్రారంభ సీజన్లో కూడా మొత్తం వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే, ఈ నెలలో తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదై తీవ్రమైన వేడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
తాజావార్తలు
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
ట్రెండింగ్
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!