Site icon NTV Telugu

Heat wave Alert: ఈ రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు.. లిస్టు విడుదల

Jel

Jel

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తాజాగా మరికొన్ని హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఎండతో పాటు వేడి గాలులు వీస్తాయని తెలిపింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వేడి పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. ఇక గాలిలో అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించింది. ఏప్రిల్ 23 తేదీలో తూర్పు మధ్యప్రదేశ్‌లో రాత్రి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. అయితే రాత్రి పూట ఉష్ణోగ్రత ప్రమాదకరమని.. శరీరం చల్లబడేందుకు అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపింది.

ఇది కూడా చదవండి: Janhvi Kapoor: తెలుగులో మరో ఆఫర్ ను పట్టేసిన జాన్వీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎనిమిది రోజుల పాటు వేడి తరంగాలు ఉండే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులతో పోలిస్తే మొత్తం ఏప్రిల్-జూన్ కాలంలో 10 నుంచి 20 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైన వేడి తరంగాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా, బీహార్, జార్ఖండ్‌లలో ఎక్కువ వేడి తరంగాలు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో పాటు రానున్న మూడు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని ఐఎండీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Allari Naresh : ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఆ సినిమా చేసాను..

Exit mobile version