Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య ఘటనలో ఈ రోజు తీర్పు వెల్లడించింది. స్థానిక సీల్దా సెషన్స్ కోర్టు నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి..‘‘నేను అన్ని ఆధారాలను, సాక్షులను విచారించాను, అందరి వాదనల్ని విన్నాను. వీటిన్ని తర్వాత నువ్వు నేరం చేసినట్లు రుజువైంది. నువ్వు దోషివి, నువ్వు తప్పకుండా శిక్షించబడాలి’’ అని అన్నారు. సోమవారం ఈ కేసులో దోషి సంజయ్ రాయ్‌కి శిక్షలను ఖరారు చేయనుంది.
Read Also: RG Kar Case Verdict: కోల్‌కతా వైద్యురాలి కేసులో సంచలనం.. దోషిగా సంజయ్ రాయ్..
కోర్టు అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించింది. అయితే, తీర్పు సమయంలో తాను దోషిని కాదని, తనను ‘‘ఇరికించారని’’ సంజయ్ రాయ్ వాదించారు. ‘‘నేను ఈ నేరం చేయలేదు. ఇది చేసిన వారిని ఎందుకు విడిచిపెడుతున్నారు..?’’ అని అడిగారు. అతడికి జవాబు ఇస్తూ.. శిక్ష ప్రకటించే ముందు సోమవారం మాట్లాడే అవకాశం ఇస్తానని న్యాయమూర్తి చెప్పారు. ఆగస్టు 9న ఈ దారుణమైన హత్య, అత్యాచారం జరిగింది. నేరం జరిగిన 160 రోజుల తర్వాత తీర్పు వెలువడింది.