గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ ఈ భామ వరుస సినిమాలు చేసిన కూడా టాలీవుడ్ లో వచ్చినంత గుర్తింపు రాలేదు.దీనితో ఈ భామకు సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి.కొన్నాళ్లుగా ఈ భామ సినిమాలకు దూరంగా ఉన్నా.. గతేడాది ఆగస్ట్ 1న పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది.అయితే ఆ తర్వాత అయినా ఆమె తన పార్ట్‌నర్ మైఖేల్ డోలాన్ ను పెళ్లి చేసుకుందా లేదా అన్నది మాత్రం తెలియలేదు.తల్లి అయిన తర్వాత ఇలియానా పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి వార్తలపై స్పందించింది. ఆ విషయాన్ని కాస్త సీక్రెట్ గానే ఉంచాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఇలియానా ప్రస్తుతం మైఖేల్ డోలాన్, తన కొడుకు కోవా ఫీనిక్స్ డోలాన్ తో కలిసి అమెరికాలో ఉంటోంది.ఆగస్ట్ లో ఆమె బిడ్డకు జన్మనిచ్చినా.. అంతకుముందు మే నెలలోనే బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ డోలాన్ ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తాజా ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. “దీనిపై చాలా పుకార్లు వచ్చాయి. దీనిని వాటికే వదిలేద్దాం. కాస్త మిస్టరీ ఉండటం కూడా బాగుంటుంది కదా. నా జీవితంలోని ఈ భాగం గురించి నేను పెద్దగా మాట్లాడదలచుకోలేదు.నా రిలేషన్షిప్ గురించి గతంలో చెప్పాను. దాని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. నా గురించి ఏది మాట్లాడినా కూడా నేను పట్టించుకోను. కానీ నా పార్ట్‌నర్ గురించి లేదా ఫ్యామిలీ గురించి మాట్లాడితే మాత్రం నాకు బాగా అనిపించదు” అని ఇలియానా స్పష్టం చేసింది.ఇక ఇదే ఇంటర్వ్యూలో తల్లి అయిన తర్వాత అందరు ఆడవాళ్లు ఎదుర్కొనే మానసిక, శారీరక సమస్యలపైనా ఇలియానా స్పందించింది. అమ్మతనం అనుభవించిన తర్వాత డిప్రెషన్ నిజమే అని ఆమె స్పష్టం చేసింది. అయితే ఈ దశలో తన పార్ట్‌నర్ మైఖేల్ డోలాన్ తనకు ఎంతో అండగా నిలిచాడని, అతడో అద్బుతమైన పార్ట్‌నర్ అని ఇలియానా చెప్పుకొచ్చింది.
