హైదరాబాద్ ఐఐటీలో మరో దారుణమయిన ఘటన జరిగింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ కి చెందిన కంది ఐఐటీ విద్యార్ధి ఒకరు సంగారెడ్డిలోని ఓ లాడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు తెల్లవారుజామున సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఆద్య లాడ్జ్ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు విద్యార్థి మేఘా కపూర్. అతని వయసు 22 సంవత్సరాలు. నెల క్రితమే IIT హైదరాబాద్ లో బిటెక్(కెమికల్) పూర్తి చేశాడు మేఘా కపూర్.
బిటెక్ అయిపోయిన తర్వాత కూడా అతను ఇంటికి వెళ్లలేదు. పైగా ఆ విద్యార్ధి నెల నుంచి లాడ్జ్ లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. మూడు నెలల అడ్వాన్సు లాడ్జికి చెల్లించాడు మేఘా కపూర్. విద్యార్థి మృత దేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వున్న మేఘా కపూర్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. విద్యార్ధి మృతికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇంతకుముందే కందిలోని ఐఐటీలో రాహుల్ అనే విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అతను మంచానికి ఉరివేసుకుని మరణించాడు.
Read Also: IIT Student incident: డిప్రెషన్ లో వున్నాడు.. ఇంత పనిచేస్తాడనుకోలేదు
క్యాంపస్ లోని E బ్లాక్ లో రూం నెంబర్ 107 లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు రాహుల్ అనే విద్యార్థి. రూం నుంచి ఎంతకీ బయటకు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తోటి విద్యార్ధులు పోలీసులకు తెలియచేశారు. రూంలో రాహుల్ మంచానికి ఉరి వేసుకున్నాడు. రాహుల్ ఎంటెక్ రెండో ఏడాది చదువుతున్నాడు. రాహుల్ తల్లిదండ్రులు. ఆగస్టు 31న ఈ ఘటన జరిగినా రాహుల్ అనుమానాస్పద మరణానికి సంబంధించి వాస్తవాలు బయటకు రాలేదు. పోస్ట్ మార్టం పూర్తిచేసి రాహుల్ స్వస్థలం నంద్యాలకు పంపారు. రెండు ఘటనలతో విద్యార్థి లోకం ఉలిక్కిపడుతోంది. కంది ఐఐటీలో అసలేం జరుగుతుందోనని అంతుచిక్కకుండా వుంది.
NTVతో లాడ్జి మేనేజర్ రమేష్ ఏం చెప్పారంటే..
ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఎవరో మా లాడ్జి పై నుంచి దూకి చనిపోయాడని మా సెక్యూరిటీ చెప్పారు. వెంటనే నేను వెళ్లి చూస్తే ఈ అబ్బాయి అని తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఆగస్ట్ 1 న మా లాడ్జ్ లో మంత్లి రెంట్ చొప్పున మూడు నెలలకు రూమ్ నెంబర్ 116 తీసుకున్నాడు. ఆగస్ట్ 1 నాడు అతని తల్లిదండ్రులతో వచ్చి లాడ్జ్ లో ఉన్నాడు. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు వెళ్లిపోయారు. IIT లో చదువు కోసమని రూమ్ రెంట్ కి తీసుకున్నారు. ఉదయం వెళ్లి మళ్ళీ సాయంత్రం వచ్చేవాడు. ఒక్కడే రూమ్ లో ఉండేవాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో మాకు తెలియదన్నాడు మేనేజర్ రమేష్.
Read Also: Hyderabad IIT Student Incident: కంది ఐఐటీలో విద్యార్థి అనుమానాస్పద మృతి
