Site icon NTV Telugu

Iga Swiatek: Korea Open 2025 విజేతగా ‘ఇగా స్వియాటెక్’

Iga Swiatek Korea Open 2025

Iga Swiatek Korea Open 2025

Iga Swiatek: ప్రపంచ ర్యాంకింగ్ లో నంబర్ 2 స్థానంలో ఉన్న ఇగా స్వియాటెక్ (Iga Swiatek) 2025 సీజన్‌లో మరో ట్రోఫీని అందుకుంది. సియోల్‌లో జరిగిన కొరియా ఓపెన్ ఫైనల్‌లో పోటా పోటీగా జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి.. ఈ ఏడాదిలో తన మూడవ టైటిల్ ను సాధించింది. ఈ విజయం ఇగా స్వియాటెక్ ను WTA నంబర్ 1 ర్యాంక్‌ తిరిగి పొందడానికి మరింత దగ్గర చేసింది. ఫైనల్‌కి ముందు ఇగా స్వియాటెక్ అద్భుతమైన ఫామ్ లో ఉండగా.. క్వార్టర్ ఫైనల్‌లో బార్బోరా క్రేజ్ కొవ్ ను 6-0, 6-3తో, సెమీస్‌లో మాయ జాయింట్ ను 6-0, 6-2తో ఎదుర్కొని సులభంగా గెలిచింది. కానీ, టైటిల్ మ్యాచ్‌లో ఆమె గట్టి అప్పోనెంట్ ఎదురయ్యింది.

Ind Vs Aus: అదరగొట్టిన కుర్రాళ్ళు.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!

మ్యాచ్ లో మొదటి సెట్ ఎకతేరిన అలెగ్జాంద్రోవ కు 1-6తో కోల్పోయిన తర్వాత, ఇగా స్వియాటెక్ రెండవ సెట్‌ను టెను బ్రేక్‌లో 7-6 (7-3) గా గెలిచి, తుది సెట్‌ను 7-5తో గెలిచి రెండున్న గంటల పాటు సాగిన పోరులో విజయం సాధించింది. ఇక మ్యాచ్ తర్వాత స్వియాటెక్ మాట్లాడుతూ.. నిజానికి, నేను ఎలా గెలిచానో నాకు తెలియడం లేదు. ఎందుకంటే.. తాను అద్భుతంగా ఆడింది. నేను కేవలం ఎదురుకోవడానికి ప్రయత్నించాను. భవిష్యత్తులో మరిన్ని ఫైనల్స్‌లో మనం ఆడతాము. ఇలా ఎల్లప్పుడూ మ్యాచ్ లు ఆడుతాం అని చెప్పింది.

తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం! చిరు వ్యాపారుల కోసం కొత్త Tata Ace Gold Plus Mini Truck లాంచ్..

అలాగే, స్వియాటెక్ తన వ్యక్తిగత ఆనందాన్ని కూడా వ్యక్తపరిచింది. నాకు ఇక్కడ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి ఇది ప్రత్యేకం, ఎందుకంటే నా తండ్రి ఒలింపిక్స్ గెలవలేదు. కానీ, కనీసం నేను ఈ టోర్నమెంట్ గెలిచాను. ఆయన వచ్చే సంవత్సరం ఇక్కడ వచ్చి ఈ అనుభూతిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానని అంది.

Exit mobile version