ప్రజలు ఎవరైనా వారి మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటే కనుక వెంటనే వారు చాట్ – బాట్ వాట్సప్ నెంబర్ ‘“9440627057” కు హాయ్ అని మెసేజ్ పంపాలి. దాంతో ఆ వెంటనే మీకు ఆ నెంబర్ నుండి ఓ గూగుల్ పేజీ లింక్ వస్తుంది. ఆపై లింక్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో పోయిన మొబైల్ వివరాలను పొందుపరిస్తే చాలు. దాంతో మనం ఇచ్చిన సంచారంతో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘాను ఏర్పాటు చేసి అతిత్వరితగతిన పోయిన మొబైల్ ఫోన్ జాడ గుర్తిస్తారు.
Also read: Viral: ఎలావస్తాయో ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ జామ్ లో ఆ మహిళ చేసిన పనిచూస్తే వావ్ అనాల్సిందే..!
ఇకపోతే తాజాగా ఏపీ లోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రజలకు పోలీసులు ఈ శుభవార్త చెప్పారు. ఇకపై ఎవరైనా పోగొట్టుకున్న సెల్ ఫోన్ జాడను ఇట్టే పసిగట్టి.. తిరిగి యజమానికి ఇచ్చేలా గొప్ప క్రియను పోలీసు శాఖ ఆరంభించింది. ఎన్టీఆర్ కృష్ణ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తీసుక వచ్చారు అధికారులు. ఈ సందర్బంగా నగర పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ విభాగంలో ఉన్న డిప్యూటీ పోలీస్ కమిషనర్లు అధిరాజ్ సింగ్ రాణా, కె.శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారి ఫోన్ల జాడను గుర్తించి మొబైల్ ఫోన్లను తిరిగి అప్పగించారు. అందించారు.
Also read: Viral Video: ఏంది భయ్యా ఇది.. సాఫ్ట్ డ్రింక్ క్యాన్లలో ఇంత సీక్రెట్ దాగుందా..?!
గత సంవత్సరం జూన్ 6న సిటిజన్ ఫ్రెండ్లీ అండ్ రెస్పాన్సివ్ పోలీసింగ్ లో భాగంగా ప్రజల సౌలభ్యం కొరకు ఈ చాట్ బాట్ సేవలను మొదలు పెట్టాం అని తెలిపారు. ఈ చాట్ బాట్ సేవలతో ఇప్పటి వరకు సుమారు 5 వేలకు పైగా మొబైల్స్ మిస్సింగ్ ఫిర్యాదులు వచ్చాయని, అందులో సుమారు రూ. 50 లక్షల విలువ చేసే 300 పైగా మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పోగొట్టుకొన్నవారికి అందించామని, ఇకపోతే తాజాగా సుమారు కోటి రూపాయల విలువ కలిగిన 628 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు పోలీసులు.