NTV Telugu Site icon

White Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా.. మరి కేంద్రప్రభుత్వం అందించే ఈ పథకాలను అందుకుంటున్నారా..

Ration Cards

Ration Cards

White Ration Card : ఎవరికైతే వారి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉందో.. వారికోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. ఆయన గాని చాలామంది కేంద్ర ప్రభుత్వం అందించే అనేక సదుపాయాలను ఉపయోగించుకోలేకపోతున్నారు. దీనికి కారణం అవగాహన లేమి. ఇన్ని పథకాలు ఉన్న లబ్ధిదారులు వాటిని ఉపయోగించుకోకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే ఏ పథకాలు రేషన్ కార్డ్ హోల్డర్స్ పొందగలరో ఓసారి చూద్దాం..

Congress: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. బీజేపీపై కాంగ్రెస్ 7 ప్రశ్నలు

ఇందులో మొదటగా ఆరోగ్యపరంగా చూస్తే.. కేంద్ర ప్రభుత్వం ” ఆయుష్మాన్ భారత్ యోజన ” అనే ఆరోగ్య భీమా పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ స్కీము కింద రేషన్ కార్డు కుటుంబాలు ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందే వెసులుబాటును కలిపించింది. ఈ కార్డు ద్వారా పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం ఆసుపత్రిలో ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయించుకునే సదుపాయాన్ని కేంద్రం కల్పించింది. కాబట్టి మీలో ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.

Bihar: ప్రారంభం కాకముందే కూలిన రూ.12 కోట్ల వంతెన

ఇక మరో కేంద్ర ప్రభుత్వం పథకం చూస్తే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలని ఉద్దేశంతో.. ” ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ” కింద పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం లక్ష ఇరవై వేల రూపాయలను సబ్సిడీ ఇస్తోంది. ఈ పథకం కింద తాజాగా మూడు కోట్ల మంది కొత్త కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. ఇక ప్రతి ఇంట్లో వంట చేసుకోవడానికి వీలుగా ” ప్రధానమంత్రి ఉజ్వల యోజన ” కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, అలాగే గ్యాస్ స్టవ్ అందిస్తున్నారు. అలాగే గ్యాస్ రీఫిల్ పై కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలను ప్రకటించింది. గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న సమయంలో రూ. 300 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి సబ్సిడీని పొందవచ్చు.

Viral Video: అబ్బా ఏం ఐడియా బాసు.. ఇలా చేస్తే నెలల తరబడి కరివేపాకు ఫ్రెష్ గా..

ఇక పేదరికంలో ఉన్న వారికి చేయూత ఇవ్వాలన్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల వారి కోసం ” ప్రధానమంత్రి విశ్వకర్మ యువజన” ను మొదలుపెట్టింది. ఈ పథకం కింద హస్త కళాకారులకు నైపుణ్యాభివృద్ధి కలిగిన వారికి కాస్త ట్రైనింగ్ ఇచ్చి మూడు లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తున్నారు. అంతేకాదు వారు చేయబోయే పనికి సంబంధించి టూల్ కిట్టులను కూడా కొనేందుకు 15 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇక అట్టడుగు పేదరికంలో ఉన్న వారికి ” అంతోద్యయ అన్న యోజన ” కింద బిపిఎల్ రేషన్ కార్డులకు దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ తోపాటు గోధుమలు, చక్కెర, కిరోసిన్ లాంటివి ఉచితంగా పొందవచ్చు. ఇలాంటి పథకాలు భారతదేశ ప్రజలకు కోసం దాదాపు 500 కు దగ్గరలో ఉన్నాయి. ఆయా సంబంధిత అధికారిక వెబ్సైట్లో వాటిని దరఖాస్తు చేసుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చు.