NTV Telugu Site icon

Hiccup Tips: ఎక్కిళ్లు ఆగడం లేదా.. అయితే ఇలా చేయండి..

Hiccup Tips, Do Not Stop Hiccups, Helth, Life Style, Water 10

Hiccup Tips, Do Not Stop Hiccups, Helth, Life Style, Water 10

ఎక్కిళ్లు రావడం సహజం. అందరికీ ఎక్కిళ్లు వస్తుంటాయి. తరచూ ఎక్కిళ్లు వస్తే చాలా ఇబ్బందికి గురవుతుంటాం. ఒక్కొసారి ఎక్కువ సమయం ఎక్కిళ్లు అలాగే ఉండిపోతాయి. ఎంత ప్రయత్నించినా ఆగవు. ఇవి ఆగేందుకు ఎన్నో ప్రయత్నాలు మొదలు పెడుతుంటాం. నీళ్లు ఎక్కువగా తాగుతుంటాం. అదే కాకుండా మనం ఏదైనా భయం లిగే విషయం విన్నా ఎక్కిళ్లు ఆగిపోతుంటాయి. ఇది కొన్ని సందర్భాల్లోనే సాధ్యమవుతుంది. కొందరికి ఎలా చేసినా.. ఎక్కి్‌ళ్లు ఆగవు. తరచూ ఎక్కిళ్లతో బాధ పడేవాళ్లు వాటి నుంచి ఉపశమనం పొందాలంటే… కొన్ని టిప్స్ పాటించాలి. ఆరోగ్య నిఫుణులు తెలిపిన ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… బెల్లంతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అందరి ఇళ్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఎక్కువగా ఎక్కిళ్లతో బాధ పడేవాళ్లు ఓ బెల్లం ముక్కను నోటిలో వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

READ MORE: Wife Tortures: ఆస్తి కోసం భర్తను బంధించి హింసించిన భార్య.. పోలీసుల జోక్యంతో..

బెల్లం నీటిని తాగినా.. ఫలితం ఉంటుంది. ఎక్కిళ్లు వచ్చినప్పుడు కొందరు కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అది చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల సమస్య పరిష్కారమవ్వక పోగా పెరిగే అవకాశం ఉంటుంది. కూల్ వాటర్ ను కూడా అవాయిడ్ చేయాలి. కేవలం శుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి. ఈ నీటిని తాగినా విముక్తి లభించకపోతే రెండు పెద్ద గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా ఎక్కిళ్లు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మరో చిట్కా ద్వారా కూడా ఎక్కిళ్లను ఆపేందుకు ప్రయత్నించవచ్చు. అదేంటంటే ముక్కు మూసుకుని నోటి నుంచి శ్వాస తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఈ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు రోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం మంచిది. ఇలా పలు సూచనలు పాటిస్తూ ఎక్కిళ్లు తగ్గించుకోవచ్చు. అవి క్రమంగా పెరిగితే చాలా అన్ఈజీగా అనిపిస్తుంది. కార్యాలయాలు, బయట ఉన్నప్పుడు మరీ ఎక్కువ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం.