Site icon NTV Telugu

GT vs MI: ఎలిమినేటర్‌ మ్యాచ్ రద్దైతే.. క్వాలిఫయర్‌ 2కు ఏ టీమ్ వెళుతుందంటే?

Gt Vs Mi

Gt Vs Mi

ఐపీఎల్‌ 2025లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌ వేదికగా మరికొన్ని గంటల్లో గుజరాత్‌ టైటాన్స్‌ , ముంబై ఇండియన్స్‌ జట్లు ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. గెలిచిన జట్టు మాత్రం క్వాలిఫయర్‌ 2లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడాల్సి ఉంటుంది. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ముల్లాన్‌పూర్‌ పిచ్ నిన్న బౌలింగ్, బ్యాటింగ్‌కు కూడా అనుకూలించింది. మరి ఈరోజు పిచ్ ఎలా ఉంటుందో అని ఆసక్తికరంగా మారింది. అయితే ఎలిమినేటర్‌ మ్యాచ్ రద్దైతే క్వాలిఫయర్‌ 2కు ఏ టీమ్ వెళుతుందో చూద్దాం.

Also Read: SV Mohan Reddy: పప్పులు, బెల్లంలా దేవాలయాల భూములను పంచుకుంటే ఊరుకోం.. మాజీ ఎమ్మెల్యే సీరియస్..!

ముల్లాన్‌పూర్‌ వేదికగా జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శుక్రవారం ముల్లాన్‌పూర్‌లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 37 డిగ్రీలు, కనిష్ఠంగా 25 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ సైతం ముల్లాన్‌పూర్‌లోనే జరగగా.. వర్షం వల్ల ఏ అంతరాయమూ కలగలేదు. ఈరోజు జరగనున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. కాబట్టి ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే.. గుజరాత్‌ క్వాలిఫయర్‌ 2కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ముంబై టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్‌ మూడో స్థానంలో ఉండడమే అందుకు కారణం.

Exit mobile version