NTV Telugu Site icon

Identical Twins: కవలల వింత కోరిక.. ఒకేసారి ఒక్కరితోనే గర్భం దాలుస్తారట..

Identical Twins

Identical Twins

Identical Twins: ఆస్ట్రేలియాలోని ప్రపంచంలోనే అత్యంత సమరూప కవలలు తమ వింత కోరికను బయటపెట్టారు. అన్ని పనులు కలిసి చేసే వీరు.. ఇప్పుడు ఒకేసారి ఒకే బాయ్‌ఫ్రెండ్‌తో ఆ అనుభూతిని పొందాలనుకుంటున్నారు. తమ బాయ్‌ఫ్రెండ్‌ను ప్రస్తావిస్తూ ఈ కోరికను వెల్లడించారు. పెర్త్ నివాసితులైన కవలలు అన్నా, లూసీ డెసింక్‌లు ఇద్దరూ బాయ్‌ఫ్రెండ్ మార్ బెన్ బైర్న్‌తో తమ గర్భాలను పొందాలని ప్రయత్నిస్తున్నామనే సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఆస్ట్రేలియాకు చెందిన కవలా అక్కచెళ్లెల్లు అన్ని పనులు కలిసే చేస్తారు. అది తినడమైనా, పడుకోవడమైనా. వారిద్దరికీ బాయ్‌ఫ్రెండ్‌​ కూడా ఒకరే. ఇప్పుడు ఆ కవలలు తమ జీవితాలను మరో అడుగు ముందుకు వెద్దామనుకుంటున్నారు. ఒకేసారు గర్భం దాల్చాలని ఫిక్సయ్యారు. 37 ఏళ్ల వయస్సు గల ఈ కవలలు తిండి, గుడ్డతో పాటు అన్ని ఒకేలా ఉండేడట్టు చూసుకుంటారు. బాత్‌రూంకు కూడా కలిసే వెళ్తారు. ప్రస్తుతం వీరిద్దరు తమ బాయ్‌ఫ్రెండ్​ బెన్​ బైర్న్‌తో కలిసి జీవిస్తున్నారు. ఇంతకు ముందు డేటింగ్​ చేసిన అబ్బాయిలందరూ తమను విడదీయడానికి ప్రయత్నించారని.. బెన్​ మాత్రం అందరికన్నా భిన్నమని ఈ అక్కాచెళ్లెల్లు చెప్పారు. బెన్​ వద్ద తమకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. అందుకే బెన్‌తో ఒకే మంచాన్ని పంచుకుంటున్నామని పేర్కొన్నారు.

Mother Tearful: ఆకలి వేస్తున్న అన్నం పెట్టడం లేదు.. కన్నీరు పెట్టుకున్న తల్లి

ఓ టీవీ షోలో పాల్గొన్న ఈ కవలలు తమ వింత కోరికను బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పటివరకు అన్ని కలిసే చేసిన తాము.. గర్భం కూడా ఒకేసారి దాల్చాలనుకుంటున్నట్టు ప్రకటించారు. ఐవీఎఫ్​ పద్ధతిలో ఇది సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ప్రెగ్నెన్సీ మాత్రం ఇద్దరికీ ఒక్కరితోనే ఒకే సమయంలో రావాలని కోరుకుంటున్నట్లు తేల్చిచెప్పారు. ఇది ఇతరులకు విడ్డూరంగా అనిపించినా.. తాము మాత్రం తమకు ఇష్టమున్నట్టు జీవించడానికి నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది లూసీ. తమ మధ్య సోదరి బంధం బలంగా ఉందని చెప్పింది. మరి వీరిద్దరిలో ఒకరు మగబిడ్డకు, మరొకరు ఆడబిడ్డకు జన్మనిస్తే పరిస్థితి ఏంటని టీవీ షో వ్యాఖ్యాత ప్రశ్నించగా.. ‘మాకు ఫర్వాలేదు. బిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని సమాధానమిచ్చారు.

Show comments