Ashish Sakharkar: నాలుగుసార్లు మిస్టర్ ఇండియా బాడీబిల్డర్ ఆశిష్ సకార్కర్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Sakharkar Passes Away: బాడీబిల్డింగ్ ప్రపంచంలో ఆశిష్ సఖార్కర్ గురించి తెలియని వారు ఉండరు. మిస్టర్ ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫోరమ్‌లలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఆశిష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఈ లెజెండరీ బాడీబిల్డర్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్నారు. ముంబైలో నివసిస్తున్న ఆశిష్ సఖార్కర్ బాడీబిల్డింగ్ ప్రపంచంలో గొప్ప స్థాయికి ఎదిగిన బాడీబిల్డర్‌లలో ఒకరు. దేశ విదేశాల్లో ఎన్నో పోటీల్లో గెలుపొంది భారతదేశంలో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్నాడు. మిస్టర్ మహారాష్ట్ర నుంచి మిస్టర్ ఇండియా, మిస్టర్ యూనివర్స్ వరకు ఎన్నో టైటిల్స్, మెడల్స్ సాధించాడు.
Also Read
- IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- Monsoon Cleaning Tips: ఈగలు, చీమలు ఇంట్లోకి వస్తున్నాయా..? నీటిలో ఇవి కలిపితే మంచి ఫలితాలు..
ఆశిష్ సఖార్కర్ బాడీబిల్డింగ్ రంగంలో మహారాష్ట్రలోనే కాకుండా భారతదేశం అంతటా ఒక ఐకాన్‌గా పరిగణించబడ్డాడు. ఆయన మిస్టర్ ఇండియాలో నాలుగుసార్లు, ఫెడరేషన్ కప్ నాలుగుసార్లు, మిస్టర్ యూనివర్స్, యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని కూడా సాధించాడు. ఆయనకు మహారాష్ట్ర అత్యున్నత క్రీడా పురస్కారం శివ్ ఛత్రపతి అవార్డు లభించింది. అయితే కొద్దిరోజుల క్రితం ఆశిష్ సకార్కర్ అస్వస్థతకు గురయ్యాడు. దీని తర్వాత చికిత్స పొందుతున్నాడు. ఎంత చేసినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. ఆశిష్ కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆశిష్ సకార్కర్ అభిమానులు, స్నేహితులు, బంధువులు, ఆయన మృతిపట్ల సంతాపాన్ని తెలియజేశారు.
తాజావార్తలు
-
Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
-
IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
-
Rohit-Kohli: ఏంటి తమాషానా.. అభిమానులు ఊరుకుంటారా.. స్టేడియం పైకప్పే లేచిపోతుంది!
-
CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!