Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్‌కు పండగే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకున్న బన్నీ, ఇకపై వరుసగా సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా తన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో ఒక కొత్త రూల్ పెట్టినట్టుగా సమాచారం. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం తనకు సంబంధించి 200 రోజుల సోలో షూట్ డేస్ మాత్రమే కేటాయించాలని నిర్ణయించుకున్నారట. అంటే, ఏ దర్శకుడైనా సరే 200 రోజుల్లోపు బన్నీకి సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయాలి.
ఒకవేళ నిర్ణీత గడువులోగా షూటింగ్ పూర్తి కాకపోతే, ఆయన ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి లేదా పెండింగ్‌లో ఉంచి తర్వాతి సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో రెండు సినిమాలను సమాంతరంగా చేసేందుకు బన్నీ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ అక్టోబర్ నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆ తర్వాత 2027 సమ్మర్‌లో మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ ప్రాజెక్టును బన్నీ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే, ఇలా ఇలా 200 డేస్ కండీషన్ పెట్టడం వల్ల.. తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలను ప్రేక్షకులకు అందించాలని అల్లు అర్జున్ భావిస్తున్నారు. మామూలుగా ఈ మధ్య.. భారీ బడ్జెట్ సినిమాలు, ముఖ్యంగా పాన్-ఇండియా ప్రాజెక్టులు పూర్తి కావడానికి చాలా సమయం పడుతోంది. అందుకే.. బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తాజావార్తలు
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!