NTV Telugu Site icon

Healthy Habits: పనిలోపడి కూర్చుకీ అత్తుకొని పోతున్నారా..? అయితే ఇలా చేయాల్సిందే..

Icmr

Icmr

Healthy Habits ICMR: మనిషి వయసు ఎంతైనా సరే.. శరీరానికి ప్రతిరోజు తగినంత శారీరక శ్రమ కల్పించకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని చేయడం., చదువుకోవడం లేక వేరే ఏదైనా పనిచేస్తున్న ఎంతో బిజీగా ఉన్న గాని కొద్ది సమయం మాత్రం శారీరిక శ్రమకు సమయం కేటాయించాల్సిందే. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) శరీరాన్ని ప్రతిరోజు కాస్త అటు ఇటు కదల్చాలని సూచిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్, ఐసిఎంఆర్ కలిసి డైట్రీ గైడెన్స్ ఫర్ ఇండియా పేరిట మరేగైన ఆరోగ్యం కోసం 17 మార్గదర్శకాలను వెల్లడించింది. సంపూర్ణ ఆరోగ్యం కొరకు శారీరక శ్రమ ప్రతిరోజు యోగా చేయడం లేదా వ్యాయామం చేయడం లాంటి సిఫారసులను అందించింది.

Lal Darwaza Bonalu: పాతబస్తీలో ప్రారంభమైన బోనాలు.. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు..

మనం ప్రతిరోజు పనిలో ఎంత బిజీగా ఉన్నా సరే కేవలం కుర్చీకే అతుక్కుపోవడం మంచిది కాదు. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి శరీరాన్ని కదలాల్చాలని ఐసిఎంఆర్ సూచిస్తుంది. ముఖ్యంగా పనిచేసే సమయాలలో స్టాండింగ్ డెస్క్ వాడాలి. లేకపోతే అరగంటకు లేదా గంట సమయానికి ఒకసారైనా లేచి నిలబడి అటు ఇటుగా ఐదు నుంచి పది నిమిషాలు నడవాలని ఐసిఎంఆర్ తెలిపింది. అంతేకాకుండా ఎప్పుడైనా ఇంట్లో గానీ.. బయట గానీ ప్రదేశంలో ఫోన్ మాట్లాడేటప్పుడు నడుస్తూ ఉండాలని తెలిపింది. ఇంకా ఎలివేటర్, లిస్ట్ వంటి బదులుగా మెట్లను ఉపయోగించాలని.. ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తూ బ్రేక్స్ వేసిన సమయంలో కుర్చీకి అంకితం కాకుండా కమర్షియల్ బ్రేకులు వచ్చిన సమయంలో అటు ఇటు తిరిగితే మంచిదని తెలిపింది.

Virat Kohli-BCCI: ఎలాంటి అపోహలు వద్దు.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ భరోసా!

ఇకపోతే తాజాగా భారత దేశంలోని 57% మంది మహిళలు 40% మంది పురుషులు ఫిజికల్ ఇన్ యాక్టివ్గా ఉంటున్నట్లు ది లాండ్ సెంట్ గ్లోబల్ హెల్త్ జనరల్ అధ్యయనంలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల్లో ఈ డేటాను అధ్యయనం చేయగా భారత్ 12వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతీయులు కూడ శారీరక శ్రమ తగ్గిపోతుంది. జీవనశైలి జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. కొంతమంది నుంచి 60 ఏళ్లు వయసు ఉన్నవారు రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు తీవ్రమైన లేదా తేలికైన వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని వయసు ఆరోగ్య స్థితిగతులను పరిమాణంలో ఉంచుకొని ఎక్సర్సైజులు, వాకింగ్ వంటి ఇతర శారీరక శ్రమను చేయాలని తెలుపుతుంది. ఇక 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు కూడా వారంలో మూడు అంతకంటే ఎక్కువ రోజులు శారీరక శ్రమను సూచిస్తుంది. అలాగే 5 నుంచి 19 ఏళ్ల పిల్లలు యుక్త వయసులకు రోజు కనీసం 60 నిమిషాల ఇంటెన్సిటీ యాక్టివిటీని సూచించింది.