NTV Telugu Site icon

Viral Video : అరె ఏంట్రా ఇది..దీన్ని తింటే ఎవరైనా బ్రతుకుతారా..

Dosaa

Dosaa

ఒకప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ లను తయారు చేసి ఒకేదాంట్లో పెట్టి ఇచ్చేవారు.. రాను రాను రైన్ బో ఐస్ క్రీమ్ పేరుతో కొత్త రుచిని పరిచయం చేశారు.. ఇక ఈ మధ్య హాట్, స్వీట్ కలిపి మరీ కొత్త వంటల ప్రయోగాలను చేస్తున్నారు.. తాజాగా ఓ ఫుడ్ వ్యాపారి ఏకంగా ఐస్ క్రీమ్ తో దోస చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇక సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.. జనాల స్పందన ఎలా ఉంటుందో నిత్యం చూస్తూనే ఉన్నాం.. రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది… ఐస్ క్రీం దోస.. అదేంటి అనుకుంటున్నారా.. ఒకసారి వీడియోను చూస్తే మీకే తెలుస్తుంది..

ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ టిఫిన్ సెంటర్ వ్యక్తి దోసను తయారు చేస్తున్నాడు. ప్లైన్ దోస పై చాకొలేట్ ఐస్ క్రీమ్ ను పూస్తాడు.. ఆపై కాసేపు కాలిన తర్వాత ఆ దోసను నాలుగు ముక్కలుగా కట్ చేశాడు.. ఆ తర్వాత తెల్లని ఐస్ క్రీమ్ ను నాలుగు భాగాలుగా పెడతాడు.. దానిపై చాక్లేట్ సిరప్ వేస్తాడు.. అయితే ఇప్పటి వరకూ ఇటువంటి దోసను తిని ఉండరు.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది.. ఒకసారి ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి..

Show comments