NTV Telugu Site icon

ICC World Cup 2023 Team: కెప్టెన్‌గా రోహిత్.. ఐసీసీ ప్లేయింగ్ 11లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!

Icc World Cup 2023 Team

Icc World Cup 2023 Team

ICC Picks Team of the Tournament for ODI World Cup 2023: ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023 సందడి ముగిసింది. భారత గడ్డపై అక్టోబరు 5న మొదలైన వరల్డ్‌కప్‌ పండుగ.. నవంబర్ 19తో ముగిసిపోయింది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన అత్యుత్తమ జట్టును ప్రకటించింది. 11 మంది ప్లేయర్లతో కూడిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌’ను ఐసీసీ ఎంపిక చేసింది. తన జట్టుకు 12వ ఆటగాడిని కూడా ఐసీసీ ఎంపిక చేసుకుంది.

ప్రపంచకప్‌ 2023లో అత్యుత్తమంగా ఆడిన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ దాహం జట్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా ఎంచుకుంది. దక్షిణాఫ్రికా యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు. వరుసగా 10 విజయాలు సాధించి ఫైనల్ చేరిన టీమిండియా నుంచి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు ఐసీసీ ప్లేయింగ్ 11లో ఉన్నారు. ఒక్కో ఆటగాడిని ఎందుకు తీసుకున్నామో అని ఐసీసీ వివరణ ఇచ్చింది.

Also Read: World Cup Trophy: పెళ్లి చేసుకున్నారు.. వన్డే ప్రపంచకప్‌ సాధించారు! పాంటింగ్‌, ధోనీ సరసన కమిన్స్‌

ఐసీసీ జట్టు:
క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, కేఎల్ రాహుల్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మధుశంక, ఆడమ్ జంపా, మహ్మద్ షమీ, గెరాల్డ్ కోయెట్జీ (12వ ఆటగాడు).

Show comments