World Cup Team of the Tournament: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయం తర్వాత ఐసీసీ (ICC) ప్రకటించిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణులు ఆధిపత్యం చెలాయించారు. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో భారత త్రయం స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు స్థానం సంపాదించారు. ఈ ముగ్గురూ జట్టు తొలి ప్రపంచకప్ విజయంలో అద్భుతమైన పాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్ దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా నుంచి కూడా ముగ్గురు క్రీడాకారిణులు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కెప్టెన్ లారా వోల్వార్ట్ (Laura Wolvaardt), టోర్నమెంట్‌లో అత్యధికంగా 571 పరుగులు (సగటు 71.37) చేసి రికార్డు సృష్టించడంతో ఆమెను ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
Vaibhav Suryavanshi: భారత్ స్క్వాడ్‌లోకి వైభవ్ సూర్యవంశీ.. లక్కంటే నీదేనయ్యా!
ఇక టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ పూర్తి వివరాలు చుస్తే.. సెమీ-ఫైనల్స్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు నుంచి అనాబెల్ సదర్లాండ్, యాష్ గార్డనర్, లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ ఈ జట్టులో ఉన్నారు. ఫైనల్ ఫోర్‌కు చేరుకోని జట్లలో పాకిస్తాన్ నుంచి వికెట్ కీపర్ సిద్రా నవాజ్ మాత్రమే చోటు దక్కించుకుంది. ఇంగ్లాండ్ నుంచి సోఫీ ఎక్లెస్టోన్ కూడా ఎంపిక కాగా.. అదే జట్టు నుంచి నాట్ స్కివర్-బ్రంట్ 12వ క్రీడాకారిణిగా ఎంపికయ్యారు.
భారతీయులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా ఏడాది పాటు ChatGPT Go సబ్‌స్క్రిప్షన్.. ఎలా పొందాలంటే..?
ICC మహిళల ప్రపంచకప్ టీమ్ ఆఫ్ టోర్నమెంట్:
స్మృతి మంధాన (భారత్)
లారా వోల్వార్ట్ (కెప్టెన్) (దక్షిణాఫ్రికా)
జెమీమా రోడ్రిగ్స్ (భారత్)
మారిజాన్ కాప్ (దక్షిణాఫ్రికా)
యాష్ గార్డనర్ (ఆస్ట్రేలియా)
దీప్తి శర్మ (భారత్)
అనాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా)
నాదిన్ డి క్లర్క్ (దక్షిణాఫ్రికా)
సిద్రా నవాజ్ (వికెట్ కీపర్) (పాకిస్తాన్)
అలానా కింగ్ (ఆస్ట్రేలియా)
సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్)
12వ క్రీడాకారిణి: నాట్ స్కివర్-బ్రంట్ (ఇంగ్లాండ్)
