ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పురోగతి సాధించాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ ఉత్తమ ర్యాంకు అందుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని.. ఏడో స్థానంలో నిలిచాడు. లీడ్స్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.
లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి.. 20వ స్థానంలో నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నాలుగో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ డకెట్ (62,149) ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఓలీ పోప్ (మూడు స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి), జామీ స్మిత్ (ఎనిమిది స్థానాలు ఎగబాకి 27వ స్థానానికి) కూడా ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు. జో రూట్ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మన్ కాగా.. హ్యారీ బ్రూక్ రెండవ స్థానంలో ఉన్నాడు.
లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు స్థానాలు కోల్పోయి.. 13వ ర్యాంకుకు పడిపోయాడు. అయితే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మాత్రం జడ్డూ నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. లీడ్స్ టెస్టులో బ్యాటింగ్, బంతితో రాణించిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మూడు స్థానాలు ఎగబాకి.. ఆల్‌రౌండర్ల జాబితాలో ఐదవ స్థానానికి చేరుకున్నాడు.
