NTV Telugu Site icon

ICC Test Ranking: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లో నెంబర్-1 బౌలర్‌ మనోడే..

Jasprit Bumrah

Jasprit Bumrah

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసి.. మరోసారి నంబర్-1 టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు.. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌ ర్యాంకింగ్స్‌లో ముందుకొచ్చాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి జైస్వాల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. పెర్త్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ సాధించాడు. దీంతో.. అతను కూడా ర్యాంకింగ్‌లో దూసుకొచ్చాడు. కోహ్లీ 9 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ ర్యాంకింగ్‌లో పెర్త్ టెస్టులో అర్ధశతకం సాధించడంంతో13 స్థానాలు ఎగబాకి 49వ స్థానానికి చేరుకున్నాడు. రిషబ్ పంత్ ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. తొలి టెస్టు ఆడలేకపోయిన శుభ్‌మన్ గిల్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం కోల్పోయాడు. గిల్ 17వ స్థానానికి పడిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. అతను ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు జరగలేదు. రోహిత్ 26వ స్థానంలో కొనసాగుతున్నాడు.

Read Also: Maharashtra CM: కొనసాగుతున్న ‘‘మహా’’ సస్పెన్స్.. సీఎం పదవిపై ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..

బౌలర్ల టెస్ట్ ర్యాంకింగ్ గురించి మాట్లాడితే.. బుమ్రా మరోసారి టెస్ట్ బౌలర్‌గా నెంబర్-1 నిలిచాడు. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబడ రెండో స్థానానికి దిగజారగా, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ మూడో స్థానానికి పడిపోయాడు. పెర్త్ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఆడనప్పటికీ.. ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం సంపాదించి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి చేరుకున్నాడు. పెర్త్ టెస్టులో మొత్తం ఐదు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ ర్యాంకింగ్స్‌లోనూ మూడు స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Read Also: Nimmala Ramanaidu : పోల‌వ‌రం ట‌న్నెల్స్ బ్యాలెన్స్ ప‌నుల పురోగతిపై స‌మీక్ష