NTV Telugu Site icon

Israel: నెతన్యాహుపై అరెస్టు వారెంట్‌ కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్‌

Nae

Nae

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సహా పలువురు నేతలు, హమాస్‌ నాయకులపై అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కోరారు. గాజా స్ట్రిప్ మరియు ఇజ్రాయెల్‌లో యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మరియు హమాస్ నాయకులు బాధ్యులని ప్రాసిక్యూటర్ చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సహా ఇజ్రాయెల్ మరియు హమాస్ నాయకులకు అరెస్ట్ వారెంట్లు కోరుతున్నట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ చీఫ్ ప్రాసిక్యూటర్ సోమవారం తెలిపారు.

ఇది కూడా చదవండి: Anand Deverakonda: టాలీవుడ్లో ఆ ధోరణి మంచిది కాదు : ఆనంద్ దేవరకొండ

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య గత ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధానికి ఇప్పుడప్పుడే ముగింపుపడేలా కన్పించట్లేదు. ఈ యుద్ధం కారణంగా లక్షలాది మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారని ఇజ్రాయెల్‌పై ప్రపంచ దేశాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అంతర్జాతీయ నేర న్యాయస్థానంలోనూ దీనిపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కీలక అభ్యర్థనలు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు సహా హమాస్‌, ఇజ్రాయెల్‌ నేతలకు అరెస్టు వారెంట్‌ జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఇది కూడా చదవండి: Jaya Badiga: అమెరికాలో సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ పౌరులపై పాల్పడిన నేరాలకు గానూ హమాస్‌ నేతలు యహ్యా సిన్వర్‌, మహమ్మద్‌ డెయిఫ్‌, ఇస్మాయిల్‌ హనియాపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని అభ్యర్థించారు. వీరి మెరుపు దాడులతో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని, ఎంతోమంది తమ ప్రియమైనవారిని కోల్పోయారన్నారు. ప్రాసిక్యూటర్‌ అప్లికేషన్‌పై ఐసీసీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Schools Close: ఢిల్లీలో తీవ్ర ఎండలు.. నోయిడాలో పాఠశాలలు మూసివేత