ICC Rules: వెస్టిండీస్ స్టార్ ‘ఎఫీ ఫ్లెచర్’ స్ఫూర్తితో.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భారీ ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ప్రజాదరణ పొందుతోంది. దీనితో పాటు క్రీడాకారిణుల కెరీర్ అవకాశాలు కూడా మెరుగవుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది మహిళా క్రికెటర్లు తమ కెరీర్ మధ్యలో కుటుంబాన్ని ప్రారంభించి, పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోమవారం మహిళా క్రికెటర్ల ప్రెగ్నెన్సీ, ప్రసవం మరియు ఆ తర్వాత తిరిగి ఆటలోకి వచ్చే ప్రక్రియ కోసం కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. సభ్య దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లకు ఈ దశలో ఎలా మద్దతుగా నిలవాలో ఒక సమగ్రమైన వ్యవస్థను ఇందులో వివరించింది.
మెడికల్ అడ్వైజరీ కమిటీ పర్యవేక్షణలో..
ఈ సరికొత్త గైడ్‌లైన్స్‌ను ఐసీసీ మెడికల్ అడ్వైజరీ కమిటీ రూపొందించింది. ఆస్ట్రేలియా మహిళా జట్టు డాక్టర్ ఫిలిప్పా ఇంగే నేతృత్వంలో ఈ మార్గదర్శకాలు తయారయ్యాయి. దీని ప్రకారం, ప్రతి బోర్డు ప్రెగ్నెంట్ అయిన క్రీడాకారిణి కోసం ఒక ప్రత్యేక ‘కేస్ మేనేజర్’ను నియమించాలి. శిక్షణలో సౌలభ్యం కల్పించడం, పిల్లల సంరక్షణ బాధ్యతలు, ప్రయాణాల్లో సహాయం అందించడం.. ప్రసవానంతరం అవసరమైన వైద్య, ఆరోగ్య సదుపాయాలను సకాలంలో అందుబాటులో ఉంచడం వంటి అంశాలను ఈ గైడ్‌లైన్స్ స్పష్టం చేస్తున్నాయి.
Also Read
6 దశల మోడల్..
ప్రసవం తర్వాత మహిళా క్రికెటర్లు మళ్లీ మునుపటి ఫామ్‌ను అందుకోవడానికి ఐసీసీ ఒక ప్రత్యేకమైన ఆరు దశల ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది. దీనిని ‘రెడీ, రివ్యూ, రిస్టోర్, రీకండిషన్, రిటర్న్, రిఫైన్’ మోడల్‌గా పేర్కొన్నారు. రెడీ అండ్ రివ్యూలో.. ప్రసవానంతరం కోలుకోవడం, శారీరక స్థితిని సమీక్షించడం. రిస్టోర్ అండ్ రీకండిషన్ లో.. పాత బలాన్ని పునరుద్ధరించుకోవడం, క్రీడకు తగ్గట్టుగా శరీరాన్ని సిద్ధం చేయడం. రిటర్న్ అండం రిఫైన్ లో.. తిరిగి పోటీ క్రికెట్లోకి అడుగుపెట్టడం, ఆ తర్వాత నిరంతర పర్యవేక్షణ ద్వారా ఆటను మెరుగుపరుచుకోవడం.
“తల్లి కావడం అనేది ఒక క్రీడాకారిణి కెరీర్‌కు ముగింపు కాకూడదు. ఈ స్పష్టమైన, ఆచరణాత్మక మార్గదర్శకాల ద్వారా బోర్డులు సరైన నిర్ణయాలు తీసుకుని, ఆటగాళ్ల శ్రేయస్సును కాపాడుతూ ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎక్కువ కాలం ఆటలో కొనసాగేలా చేయవచ్చు” అని ఐసీసీ ప్రతినిధి తెలిపారు.
ఆదర్శంగా నిలిచిన వెస్టిండీస్ స్టార్ ఎఫీ ఫ్లెచర్
వెస్టిండీస్ క్రికెటర్ ఎఫీ ఫ్లెచర్ 2021లో కొడుకుకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ క్రీడలోకి అడుగుపెట్టి, ఐసీసీ మహిళా వరల్డ్ కప్ 2026లో ఆడుతోంది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమె స్వాగతించింది. “ప్రసవం తర్వాత శారీరకంగా కోలుకోవడం ఒక ఎత్తయితే, చిన్న బిడ్డను వదిలి మ్యాచ్‌లకు రావడం మానసికంగా పెద్ద సవాల్. ఇలాంటి సమయంలో బోర్డుల నుండి బలమైన మద్దతు అవసరం. ఐసీసీ తెచ్చిన ఈ కొత్త పాలసీ వల్ల భవిష్యత్తులో మరికొంత మంది మహిళా క్రికెటర్లు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ధైర్యంగా మైదానంలోకి తిరిగి రాగలుగుతారు” అని ఎఫీ ఫ్లెచర్ ఆనందం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!