NTV Telugu Site icon

ICC: ఆధిపత్యం చెలాయించిన ఆ దేశ ఆటగాళ్లు.. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వారికే

Icc

Icc

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ఉత్తమ ఆటగాళ్లకు అవార్డులను ప్రకటించింది. ఈసారి శ్రీలంక ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. పురుషుల జట్టులో స్టార్ ఆల్ రౌండర్ దునిత్ వెలలాగే, మహిళల జట్టులో హర్షిత సమరవిక్రమ ఆగస్టు నెలలో ప్లేయర్‌లుగా ఎంపికయ్యారు. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అలాగే.. ఐర్లాండ్ పర్యటనలో హర్షిత ఆకట్టుకుంది. ఒక నెలలో ఒకే దేశానికి చెందిన పురుష, మహిళా ఆటగాళ్లు ఇద్దరూ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్‌లో భారత ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన ఈ అవార్డును తీసుకున్నారు.

Yogi Adityanath: ‘‘పాకిస్తాన్ మానవాళికి క్యాన్సర్’’ .. విభజన పాపం కాంగ్రెస్‌దే..

దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జాడెన్ సీల్స్‌ను అధిగమించి వెలలాగే ఈ అవార్డును గెలుచుకున్నాడు. భారత్‌పై శ్రీలంక 2-0తో సిరీస్ విజయం సాధించిన సమయంలో వెలలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. 31 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్.. అజేయంగా 67, 39 రెండు ఇన్నింగ్స్‌లు ఆడడమే కాకుండా.. ఆ సిరీస్‌లో మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక పురుష ఆటగాళ్లు ఈ అవార్డును అందుకోవడం ఐదోసారి. ఇంతకు ముందు ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఈ అవార్డును గెలుచుకున్నారు.

Karnataka: పాలస్తీనా జెండాలతో హల్‌చల్.. నలుగురు మైనర్లు అరెస్ట్

మరోవైపు.. మహిళల అవార్డు రేసులో హర్షిత ఐర్లాండ్‌కు చెందిన ఓర్లా ప్రెండర్‌గాస్ట్, గాబీ లూయిస్‌ను కిందకు నెట్టి వచ్చింది. ఐర్లాండ్ పర్యటనలో.. హర్షిత వన్డే ఇంటర్నేషనల్‌లో సెంచరీ చేసిన మూడవ శ్రీలంక మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 26 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ హర్షిత రెండు టీ20 ఇంటర్నేషనల్స్‌లో 169.66 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 151 పరుగులు చేసింది. మొదటి మ్యాచ్‌లో 45 బంతుల్లో 86 పరుగులతో అజేయంగా నిలిచింది. అలాగే.. బెల్ఫాస్ట్‌లో జరిగిన మూడు వన్డేలలో 172 పరుగులు చేపింది. ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికైన రెండో శ్రీలంక క్రికెటర్ హర్షిత. ఈ ఏడాది మే, జూలైలో శ్రీలంక కెప్టెన్ చమ్రీ అటపట్టు రెండుసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది.

Show comments