Site icon NTV Telugu

IND vs SL Tickets: భారత్, శ్రీలంక మ్యాచ్ టికెట్స్ సేల్ షురూ.. పూర్తి వివరాలు ఇవే!

Ind Vs Sl Tickets

Ind Vs Sl Tickets

BCCI releases tickets for India vs Sri Lanka: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 10 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత శ్రీలంకతో భారత్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ వచ్చింది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 2న భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబందించిన టికెట్స్ గురువారం మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉండనున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి బుక్‌మైషో యాప్‌లో ఈ మ్యాచ్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. ముంబై స్టేడియం కెపాసిటీ 33 వేలు మాత్రమే. దీంతో టికెట్ల అమ్మకం మొదలైన కొన్ని నిమిషాల్లోనే అన్ని టికెట్లు అమ్ముడుపోయే అవకాశం ఉంది. భారత్ ఆడే మ్యాచుల టికెట్లు ఎంత వేగంగా అమ్ముడుపోతాయో అందరికీ తెలిసిందే.

Also Read: Glenn Maxwell-BCCI: నాకు భయంకరమైన తలనొప్పి వచ్చింది.. బీసీసీఐపై గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫైర్!

భారత్, శ్రీలంక మ్యాచ్ టికెట్స్ విషయం తెలిసిన ఫ్యాన్స్ టికెట్లు బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే బుక్‌మైషోలో మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయడం చాలా ఇబ్బందిగా ఉండడంతో.. తమ అభిమాన క్రికెటర్లను మైదానంలో చూసే అవకాశం పోతుందని ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. బుక్‌మైషో తమను మోసం చేస్తోందని ఫ్యాన్స్ ఇప్పటికే చాలాసార్లు ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. నిమిషాల్లోనే టికెట్స్ అయిపోవడం, చాలా సమయం వెయిటింగ్ లిస్టు చూపించిన అనంతరం టికెట్లు దొరక్కపోవడంతో ఫ్యాన్స్ బుక్‌మైషోపై మండిపడుతున్నారు. మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version