Site icon NTV Telugu

ICC Men’s T20 World Cup 2026 Winner: టీ20 ప్రపంచ కప్ 2026 విజేత ఆ జట్టే.. AI ఏం చెబుతుందంటే!

Icc Men’s T20 World Cup 2026 Winner

Icc Men’s T20 World Cup 2026 Winner

ICC Men’s T20 World Cup 2026 Winner: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత జట్ల ఫామ్, నిపుణుల విశ్లేషణల ప్రకారం ఏ జట్లు ఫేవరెట్‌గా ఉన్నాయో ఏఐ కొన్ని జట్లను పేర్కొంది. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూసేద్దామా..

టీ20 క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద సమరానికి సమయం ఆసన్నమైంది. 20 జట్లు, 55 మ్యాచ్‌లు.. లక్ష్యం ఒక్కటే. అదే ప్రపంచకప్ టైటిల్. ఉపఖండం పిచ్‌లపై జరగనున్న ఈ టోర్నీలో విజేత ఎవరనే దానిపై ఇప్పటికే క్రికెట్ పండితులు తమ అంచనాలను సిద్ధం చేశారు. వీటిని పరిగణలోకి తీసుకొని విజేతను అంచనా వేసింది ఏఐ (AI).

T20 World Cup 2026: బంగ్లాదేశ్ మనకు ఏం చేసింది?.. పీసీబీపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు!

భారత్ (Team India):
ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 జట్టుగా ఉన్న భారత్ ఈసారి టైటిల్ గెలవడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయనీ ఏఐ (AI) పేర్కొంది. దీనికి కారణం డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, 2024 వరల్డ్ కప్ తర్వాత ఆడిన 37 మ్యాచ్‌ల్లో 32 విజయాలు సాధించి భీకరమైన ఫామ్‌లో ఉండడటమే అంటూ పేర్కొంది.

అలాగే బలబలాను విశ్లేషిస్తూ.. అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్ల ధాటికి ఉపఖండం పిచ్‌ పై వారి ప్రతాపాన్ని చూపిస్తారని పేర్కొంది. అలాగే టీమిండియాకు సొంత ప్రేక్షకుల మద్దతు, పిచ్‌ లపై పూర్తి అవగాహన ఉండటం భారత్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్ అని తెలిపింది.

ఆస్ట్రేలియా (Australia):
ఆస్ట్రేలియా ఎప్పుడూ ఐసీసీ ఈవెంట్లలో తన మార్క్ ఆట తీరును చూపిస్తుంది. మిచెల్ మార్ష్ నాయకత్వంలో ఆసీస్ జట్టు యువత, అనుభవజ్ఞుల కలయికతో బలంగా ఉంది. ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి వారు ఒక్కరే మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. ఇంకా జట్టులో ఆడమ్ జంపా రూపంలో వారి వద్ద అత్యుత్తమ టీ20 స్పిన్నర్ ఉన్నాడు. అలాగే భారత పిచ్‌లపై ఐపీఎల్ ఆడిన అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Viral Video: “స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ”.. డెలివరీబాయ్ ఏం చేశాడంటే..

సౌత్ ఆఫ్రికా (South Africa):
గత ఎడిషన్‌లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న ప్రోటీస్ జట్టు ఈసారి కచ్చితంగా గెలవాలనే కసితో ఉంది. ఐడెన్ మార్క్రామ్ సారథ్యంలో సౌత్ ఆఫ్రికా స్థిరమైన ప్రదర్శన చేస్తోంది. హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి హిట్టర్లతో వారి బ్యాటింగ్ లైనప్ భయంకరంగా ఉంది.

ఇది ఇలా ఉండగా తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 15న భారత్‌ తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని నిర్ణయించడం టోర్నీలో సంచలనంగా మారింది. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి. ఇక ఈసారి విజేతకు దక్కే ప్రైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచింది. ఛాంపియన్‌గా నిలిచిన జట్టు సుమారు రూ. 27 కోట్లు ($3 Million) గెలుచుకోనుంది.

Exit mobile version