Site icon NTV Telugu

ICC Fine: పాపం టీమిండియా.. మ్యాచ్ ఫీజులో షాక్ ఇచ్చిన ఐసీసీ

Icc Fine

Icc Fine

ICC Fine: టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. కానీ ఈ సంతోష సమయంలో టీమిండియాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వన్డే సిరీస్‌ రెండవ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ భారత క్రికెట్ జట్టుకు జరిమానా విధించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. 358 పరుగులు చేసినప్పటికీ భారత జట్టు గెలుపు సొంతం చేసుకోలేక పోయింది. అలాగే ఈ మ్యాచ్‌లో భారత జట్టు తన ఓవర్లను ఆలస్యంగా పూర్తి చేసింది. దీంతో ఐసీసీ నిబంధనలలో భాగంగా ఇప్పుడు టీమిండియాకు జరిమానా విధించింది. టీమిండియా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది.

READ ALSO: Sania Mirza: ఈ మహిళా స్టార్ కూడా నిశ్చితార్థం తర్వాతే ‘నో మ్యారేజ్’ డిసిషన్! మీకు తెలుసా..

ఈ జరిమానాను మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ టీమిండియాపై విధించారు. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో భారత జట్టు లక్ష్యానికి రెండు ఓవర్లు తక్కువ బౌలింగ్ చేసింది. దీంతో ICC ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం టీమిండియాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఒక ఆటగాడు నిర్ణీత సమయంలోపు బౌలింగ్ చేయకపోతే, ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు. దీంతో కెప్టెన్ KL రాహుల్ విచారణ అవసరం లేదని, జరిమానాను అంగీకరించాడు.

READ ALSO: UP: కాటేసిన పోలీసు ప్రేమ.. సూసైడ్ చేసుకున్న ఇన్‌స్పెక్టర్.. వెలుగులోకి సంచలన నిజాలు

Exit mobile version