NTV Telugu Site icon

Mohammed Siraj: డిఎస్పి మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు ఐసీసీ షాక్.. భారీ జ‌రిమానా.. అంతేకాదండోయ్..!

Mohammed Siraj

Mohammed Siraj

Mohammed Siraj: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఐసీసీ భారీ షాక్‌ ఇచ్చింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆటలో సిరాజ్ దూకుడుగా ప్రవర్తించడంతో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా సిరాజ్‌పై చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో సిరాజ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ ను కూడా నమోదు చేసింది. అసలు ఏం జరిగిందన్న విషయానికి వస్తే..

Read Also:Vivo X200 FE: 6500mAh భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చేసిన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ స్మార్ట్‌ఫోన్ వివో X200 FE..!

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ లో ఇరు జట్లు 387 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో ఎవరికి ఆధిక్యం దక్కలేదు. ఆ తరువాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టగా, ఓపెనర్ బెన్ డకెట్ (12) సిరాజ్ బౌలింగ్‌లో బుమ్రా చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే, డకెట్ పెవిలియన్‌కి వెళ్లే సమయంలో సిరాజ్ అతడి దగ్గరకు వెళ్లి కాస్త దూకుడుగానే అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసి సంబరాలు చేసుకున్నాడు. అయితే, ఈ వ్యవహారాన్ని ఐసీసీ కాస్త సీరియస్ గానే తీసుకుంది. ఐసీసీ Article 2.5 ప్రకారం, ఇది స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంది. దీంతో సిరాజ్‌కి జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్ విధించింది.

Read Also:VIVO X Fold 5: 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, డ్యూయల్ డిస్ప్లే, హైఎండ్ డిజైన్ తో వచ్చేసిన వివో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్..!

ఇకపోతే, ఏ ఆటగాడైన సరే.. 24 నెలల వ్యవధిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారతాయి. అవి ఎలా అంటే.. రెండు సస్పెన్షన్ పాయింట్లకు ఒక టెస్ట్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధానికి సమానం. అంటే ఆ ప్లేయర్ భవిష్యత్‌లో ఆడబోయే ఆటలపై నిషేధం విధించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆటగాళ్లు సంబరాలు కూడా ఓ పద్దతిలో చేసుకుంటే ఈ జరిమానాలు నుండి తప్పించుకోవచ్చు.