Site icon NTV Telugu

4-Day Tests: నాలుగు రోజుల టెస్ట్‌లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్..?

Icc

Icc

4-Day Tests: ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న వన్డేలు, టి20లు మధ్య టెస్టు ఫార్మాట్‌పై వివిధ దేశాల్లో ఆసక్తి తగ్గుతుండగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2027-29 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌ లో భాగంగా చిన్న దేశాలకు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లను అనుమతించడానికి ఐసీసీ సిద్ధమైందని ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఇందులో భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ లకు మాత్రం ఐదు రోజుల టెస్ట్‌ లకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Air India: బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్లలో సమస్య.. ఒకే రోజు లండన్, పారిస్ విమానాలు రద్దు..

ఈ ఏడాది లార్డ్స్ వేదికగా జరిగిన WTC ఫైనల్ సందర్భంగా జరిగిన చర్చల్లో ఐసీసీ చైర్మన్ జైషా, నాలుగు రోజుల టెస్టుల పట్ల తన మద్దతు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని 2027-29 టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం అధికారికంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. చిన్న దేశాలు ఎక్కువ రోజులు టెస్టులు నిర్వహించలేవని, వ్యయ భారం ఎక్కువ అవుతుందని భావిస్తూ టెస్టులకు దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల టెస్టులు ఉండడం వల్ల మూడు టెస్టుల సిరీస్‌ ను మూడు వారాల్లో పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ఇది ఆయా దేశాలకు అన్ని విధాలుగా సరిపోతుందని ఐసీసీ అభిప్రాయం.

అయితే, నాలుగు రోజుల టెస్టుల్లో ప్రతిరోజూ కనీసం 98 ఓవర్లు జరగాల్సిందిగా నిబంధన ఉండేలా గేమ్ ప్లే హవర్స్‌ను పొడిగించనున్నట్లు సమాచారం. ఇలా రోజులో జరిగే ఓవర్ల సంఖ్యను పెంచి, ఒక రోజు తక్కువ అయినా మ్యాచ్ సమగ్రంగా జరగేలా చేస్తుంది. ఈ కొత్త నిబంధనల్లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాత్రం ప్రత్యేక మినహాయింపుతో ఐదు రోజుల టెస్టులు కొనసాగించనున్నారు. ముఖ్యంగా యాషెస్ (ఇంగ్లండ్-ఆస్ట్రేలియా), బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ (భారత్-ఆస్ట్రేలియా), అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ (భారత్-ఇంగ్లండ్) లాంటి కీలక సిరీస్‌ లు మాత్రం ఐదు రోజుల గానే ఉంటాయి.

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రేవంత్, ఈటల, రఘునందన్ టార్గెట్!

ఐసీసీ 2017 నుంచే ద్వైపాక్షిక సిరీస్‌ లలో నాలుగు రోజుల టెస్టులుకు అనుమతి ఇచ్చింది. ఇంగ్లండ్ ఇటీవల జింబాబ్వేతో నాలుగు రోజుల టెస్ట్‌ ను ట్రెంట్ బ్రిడ్జ్‌ లో ఆడింది. అంతకుముందు 2019, 2023లో ఐర్లాండ్‌తోనూ నాలుగు రోజుల టెస్ట్‌లు జరిగాయి. అయితే, 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ ఇప్పటికే షెడ్యూల్ అయినందున అన్ని మ్యాచ్‌లు ప్రస్తుత ఐదు రోజుల టెస్ట్ ఫార్మాట్‌లోనే కొనసాగుతాయి. ఈ సైకిల్‌లో మొత్తం 27 టెస్ట్ సిరీస్‌లు ఉండగా.. అందులో 17 సిరీస్‌లు రెండు మ్యాచ్‌లతో, 6 సిరీస్‌లు మూడు మ్యాచ్‌ లతో ఉంటాయి. వీటితోపాటు భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఈ సైకిల్‌లో ఒక్కో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను ఒకరికొకరు ఆడతారు.

Exit mobile version