Site icon NTV Telugu

Ibomma Ravi: ఐబొమ్మ రవికి 5 రోజుల కస్టడీ.. నేటి నుంచి పోలీసుల విచారణ..!

Ravi Ibomma

Ravi Ibomma

Ibomma Ravi: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవిని నాంపల్లి కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. సైబర్ క్రైమ్ పోలీసులు వాస్తవానికి వారం రోజుల పాటు కస్టడీ కోరగా.. న్యాయస్థానం ఐదు రోజులకు మాత్రమే అనుమతినిచ్చింది. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు అధికారులు నేడు (గురువారం) రవిని చంచల్‌గూడ జైలు నుంచి తమ అదుపులోకి తీసుకోనున్నారు.

Road Mishap: జడ్చర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. యాసిడ్ లారీని ఢీకొన్న ప్రవేట్ ట్రావెల్స్ బస్సు..!

ఈ ఐదు రోజుల విచారణలో పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక రహస్యాలను ఛేదించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రధానంగా ఐబొమ్మ, బప్పం (Bappam) వెబ్‌సైట్లలో సినిమాలను అప్‌లోడ్ చేసే విధానం, సైట్ల నిర్వహణతో పాటు, కంటెంట్‌ను నిల్వ చేయడానికి వాడిన సర్వర్ల సాంకేతిక వివరాలను రవి నుంచి రాబట్టడమే లక్ష్యంగా విచారణ సాగనుంది. సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ కేసులో రవి కీలక సూత్రధారి కావడంతో, ఈ కస్టడీ విచారణలో మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

YS Jagan: నేడు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..!

Exit mobile version