I BoMMA Ravi Case: ఐ బొమ్మ రవిపై పోలీసులు మరో మూడు సెక్షన్‌లు జోడించారు. ఇప్పటికే రవిపై 10 సెక్షన్లు పెట్టారు. IT యాక్ట్ , BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా ఫోర్జరీ సెక్షన్‌ను జోడించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరు మీద పాన్ కార్డ్, బైక్ లైసెన్స్, ఆర్‌సీలు తీసుకున్నట్లు గుర్తించారు. ఫోర్జరీ సెక్షన్లు జోడిస్తూ కోర్టులో మెమో ఫైల్ దాఖలు చేశారు. మరో వైపు రెండు రోజు రవి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నారు. Crypto wallets వివరాలు, విదేశీ పార్ట్నర్ల వివరాలపై ఆరా తీయనున్నారు.
READ MORE: Winter Hair Care Tips: చలికాలంలో జుట్టు తెగ రాలుతోందా..? ఈ చిట్కాలు పాటించండి..
కాగా.. ఐ బొమ్మ కేసులో ఐదు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజు(గురువారం) రవిని పోలీసులు విచారించారు. ఈ కస్టడీలో కీలక విషయాలు రాబటారు. ఐ బొమ్మ రవి బ్యాంక్ లావాదేవిలపై ప్రధానంగా ఆరా తీశారు ccs పోలీసులు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై కూడా విచారించారు. రవిపై ఫారెనర్స్ యాక్ట్ సెక్షన్ జోడించిన పోలీసులు. NRE , క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్స్ తో పాటు దేశంలోని బ్యాంక్ ఖాతాలపై ఆరా తీశారు. ఎందుకంటే రవి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే కదా. ఇక ఐ బొమ్మ వెబ్ సైట్, ఐపి అడ్రెస్ సర్వర్ డేటాపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐ బొమ్మ వెబ్ సైట్ రన్ చేసేందుకు ఐపి అడ్రస్ లు ఎలా మార్చాడనేది కూడా కూపీ లాగారు. ఎక్కడెక్కడ ఉంటూ అప్లోడ్ చేసాడు.. ఏమేం టెక్నాలజీ వాడాడు అనే కోణంలో విచారణ సాగింది. ఐ బొమ్మ 1 నుంచి మూవీ రూల్స్ వెబ్ సైట్ కు రీ డైరెక్ట్ కావడంపై కూడా పోలీసులు ఆరా తీశారు. హార్డ్ డిస్క్ లకు పాస్ వర్డ్ లు ఉండటంతో.. రవి ద్వారా వాటిని ఓపెన్ చేయించి ఎథికల్ హ్యాకర్స్ సహాయంతో అనాలసిస్ చేస్తున్నారు. నెదర్లాండ్స్ లో రవి హోమ్ సర్వర్ల డేటాపై కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఇమ్మడి రవి వాడిన మొబైల్స్ పై వివరాలు సేకరించారు పోలీసులు.
READ MORE: Amala : తన బాల్యం, పుట్టింటి గురించి మొదటిసారిగా ఓపెన్ అయిన అమల – ఎన్నో తెలియని సంగతులు బయటకు!
