iBomma Ravi : ఐబొమ్మ రవి ఐదోరోజు కస్టడీ విచారణ.. కీలక విషయాలు బయటకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐ బొమ్మ కేసులో కీలక ఇమ్మడి రవిపై కస్టడీ విచారణ ఐదో రోజుకు చేరుకుంది. నేటితో ఆయన కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో, గత నాలుగు రోజులుగా సైబర్ క్రైమ్ పోలీసులు రవిని ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణ మొత్తం ఐబొమ్మ రవి పొంతన లేని సమాధానాలు ఇస్తూ, పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు తెలిపారు. యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది, విదేశాల్లో ఉన్న సర్వర్ల వివరాలపై ఆధారాలు చూపిస్తూ ప్రశ్నించినప్పటికీ, ఇమ్మడి రవి కరెక్ట్ ఆన్సర్‌లు ఇవ్వలేదని విచారణ అధికారులు తెలిపారు. డేటా అంతా విదేశాల్లో ఉందని, తనకు సహకరించిన వారు ఎవరూ లేరని చెప్తూ తప్పించుకోవడానికి యత్నించాడు. అంతేకాక, హార్డ్‌డిస్క్‌లలో ఉన్న సినిమా ఫైళ్లు మినహా మిగతా డేటా మొత్తాన్ని అరెస్టు ముందు డిలీట్ చేసినట్లు కూడా విచారణలో బయట పడింది.
Also Read : Keerthy Suresh: మోడర్న్ వైట్ లుక్‌లో కీర్తి మ్యాజిక్..
Also Read
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో ఎవరు బలి అవుతారు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
అయితే, ఈ కేసులో ఇమ్మడి రవి కదలికలను సుమారు మూడు నెలల పాటు గమనించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, అతని ఈ–మెయిల్ లింక్‌ల ద్వారానే గుర్తించారు. ‘ఈ ఆర్ ఇన్ఫోటెక్’ పేరుతో కొనుగోలు చేసిన డొమైన్‌లు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, వాడిన క్రెడిట్–డెబిట్ కార్డుల వివరాలు ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే ఆయా బ్యాంకులకు మెయిల్స్ పంపించారు. రవి వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్‌సైట్ రూపొందించి, పైరసీ సినిమాలను అప్లోడ్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. పైరసీ సినిమాలు చూడడమే అలవాటు కాగా, అదే తనను ఈ దారికి వచ్చేలా చేసిందని సమాచారం. కాగా, కస్టడీ విచారణలో ఐబొమ్మ రవి సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో ఎవరు బలి అవుతారు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!