Site icon NTV Telugu

iBomma Ravi : ఐబొమ్మ రవి ఐదోరోజు కస్టడీ విచారణ.. కీలక విషయాలు బయటకు

Ibomma Ravi

Ibomma Ravi

ఐ బొమ్మ కేసులో కీలక ఇమ్మడి రవిపై కస్టడీ విచారణ ఐదో రోజుకు చేరుకుంది. నేటితో ఆయన కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో, గత నాలుగు రోజులుగా సైబర్ క్రైమ్ పోలీసులు రవిని ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణ మొత్తం ఐబొమ్మ రవి పొంతన లేని సమాధానాలు ఇస్తూ, పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు తెలిపారు. యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది, విదేశాల్లో ఉన్న సర్వర్ల వివరాలపై ఆధారాలు చూపిస్తూ ప్రశ్నించినప్పటికీ, ఇమ్మడి రవి కరెక్ట్ ఆన్సర్‌లు ఇవ్వలేదని విచారణ అధికారులు తెలిపారు. డేటా అంతా విదేశాల్లో ఉందని, తనకు సహకరించిన వారు ఎవరూ లేరని చెప్తూ తప్పించుకోవడానికి యత్నించాడు. అంతేకాక, హార్డ్‌డిస్క్‌లలో ఉన్న సినిమా ఫైళ్లు మినహా మిగతా డేటా మొత్తాన్ని అరెస్టు ముందు డిలీట్ చేసినట్లు కూడా విచారణలో  బయట పడింది.

Also Read : Keerthy Suresh: మోడర్న్ వైట్ లుక్‌లో కీర్తి మ్యాజిక్..

అయితే, ఈ కేసులో ఇమ్మడి రవి కదలికలను సుమారు మూడు నెలల పాటు గమనించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, అతని ఈ–మెయిల్ లింక్‌ల ద్వారానే గుర్తించారు. ‘ఈ ఆర్ ఇన్ఫోటెక్’ పేరుతో కొనుగోలు చేసిన డొమైన్‌లు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, వాడిన క్రెడిట్–డెబిట్ కార్డుల వివరాలు ఇవ్వాలని పోలీసులు ఇప్పటికే ఆయా బ్యాంకులకు మెయిల్స్ పంపించారు. రవి వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్‌సైట్ రూపొందించి, పైరసీ సినిమాలను అప్లోడ్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. పైరసీ సినిమాలు చూడడమే అలవాటు కాగా, అదే తనను ఈ దారికి వచ్చేలా చేసిందని  సమాచారం. కాగా, కస్టడీ విచారణలో ఐబొమ్మ రవి సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో మరోసారి కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.

Exit mobile version