Bank Employees Salary Hike: బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. 15 శాతం పెరిగిన జీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Employees Salary Hike: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వ, కొంతమంది పాత ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపును ప్రతిపాదించింది. త్వరలో వారంలో ఐదు రోజులు పనులు ప్రారంభించే యోచన కూడా ఉంది. గురువారం ఉద్యోగులకు జీతాలు పెంచాలని ప్రతిపాదన వచ్చినా.. ఇతర మార్పులతో పాటు వేతనాలు మరింత పెంచాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, పీఎన్ బీ వంటి బ్యాంకులు జీతాల పెంపు కోసం అధిక కేటాయింపులను ప్రారంభించాయి. ఈ బ్యాంకులు వేతనాలను 10 శాతం పెంచేందుకు ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందిస్తున్నాయి. అలాగే, 15 శాతం జీతం పెరుగుదల కోసం ఒక మొత్తాన్ని పక్కన పెట్టింది. అంటే ఈ రెండు ప్రతిపాదనలు ఆమోదం పొందితే ఈ బ్యాంకుల ఉద్యోగుల జీతం 25 శాతం పెరగవచ్చు.
Read Also:Selfie Video: మంచిర్యాల రైల్వే స్టేషన్లో సెల్పీ వీడియో కలకలం.. బీఆర్ఎస్ నాయకుడి వేదింపులు తాళలేక..!
Also Read
- Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
- Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
- చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
- Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
2024 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకులు మంచి లాభాలను ఆర్జించాయి. కోవిడ్ సమయంలో రుణదాతలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడమే కాకుండా ప్రభుత్వ పథకాలను పని చేయడంలో ఉద్యోగులు చాలా కష్టపడ్డారు. అలాంటి ఉద్యోగులు ఈ పెంపు అర్హులు. అందుకే వారి జీతంలో పెరుగుదల 15 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలలోపు ఉద్యోగుల జీతాల పెంపు ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వంతో మూడేళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత 2020లో చివరిసారిగా బ్యాంక్ ఉద్యోగుల జీతాన్ని పెంచారు.
Read Also:Telangana Assembly Elections: వందలో రెడ్డీలకే 37 స్థానాలు.. సీనియర్లలో అసంతృప్తి..!
బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల నిబంధన అమలు చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల పనివేళలు పెరగడంతో పాటు వారంలో రెండు రోజులు సెలవులు వస్తాయి.
తాజావార్తలు
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
-
Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!