NTV Telugu Site icon

Assistant Collector: ఏపీ సీఎంను కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌.. ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెప్పిన జగన్

Cm Jagan

Cm Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఐఏఎస్ ప్రొబేషనర్స్ ఇవాళ ( సోమవారం ) కలిశారు. ఏపీ క్యాడర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్స్ (అండర్‌ ట్రైనింగ్‌ 2022) బ్యాచ్‌కు చెందిన 10 మంది సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. సీఎంను క‌లిసిన వారిలో కుషల్‌ జైన్‌ (అనంతపురం), మంత్రి మౌర్య భరద్వాజ్‌ (వైఎస్సార్‌ జిల్లా), రాఘవేంద్ర మీనా (శ్రీకాకుళం), సౌర్య మన్‌ పటేల్‌ (ప్రకాశం), బి.స్మరణ్‌ రాజ్‌ (అనకాపల్లి జిల్లా), బి.సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ (విజయనగరం), సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి (తూర్పుగోదావరి), కల్పశ్రీ కే.ఆర్‌ (పల్నాడు), తిరుమణి శ్రీ పూజ (ఏలూరు), వి.సంజనా సింహా (నెల్లూరు)లు ఉన్నారు.

Read Also: Bihar Train Incident: డ్రైవర్ లేకుండా కదిలిన గూడ్సు రైలు.. తప్పిన భారీ ప్రమాదం

ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని సీఎం జ‌గ‌న్ ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌కు మార్గనిర్ధేశం చేశారు. అనంత‌రం యువ అధికారుల‌కు ఆల్‌ ది వెరీ బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ హెచ్‌ఆర్‌డీ డీజీ ఆర్‌.పి.సిసోడియా, ఏపీ హెచ్‌ఆర్‌డీ జేడీజీ పి.ఎస్‌.ప్రద్యుమ్నలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

Read Also: Naga Shaurya: ఆ హీరోయిన్ ఎవరో చెప్తే.. నా పెళ్ళాం నన్ను మాములుగా కొట్టద్దు