Site icon NTV Telugu

IAS officers transferred: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Ap Secretariat

Ap Secretariat

IAS officers transferred: ఆంధ్రప్రదేశ్‌లో బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఇప్పటికే బదిలీ చేస్తూ వస్తున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. ఇప్పుడు తాజాగా, మరికొంతమంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేశారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హర్టికల్చర్ డైరెక్టర్‌గా గంధం చంద్రుడు.. గ్రామ, వార్డు సచివాలయ అసిస్టెంట్ డైరెక్టరుగా హెచ్ ఎం ధ్యానచంద్ర, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా నిశాంతి, కొనసీమ జిల్లా జేసీగా శ్రీవాస్ నూపూర్, నంద్యాల జేసీగా రాహుల్ కుమార్ రెడ్డి, కేఆర్ పురం ఐటీడీఏ పీవోగా సూర్యతేజ, ఎస్ఎస్ శ్రీధర్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. కాగా, ఈ మధ్యే.. పార్వతీపురం మన్యం జిల్లా జేసీగా ఆర్‌.గోవిందరావు, అన్నమయ్య జిల్లా జేసీగా పర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, వెనుకబడిన తరగతుల ఆర్థిక కార్పొరేషన్‌కు వీసీ, ఎండీగా క్రైస్ట్‌ కిషోర్‌, ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌గా హిమాన్షు కౌశిక్‌, కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఎ.భర్వత్‌ తేజ, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డిపార్టుమెంట్‌ డైరెక్టర్‌గా వి.ఆంజనేయులు, స్వామిత్వ స్పెషల్‌ కమిషనర్‌గా ఎ.సిరి, ఆయుష్‌ కమిషనర్‌గా ఎస్‌.బి.ఆర్‌.కుమార్‌లకు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే.

 

Exit mobile version