NTV Telugu Site icon

Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

New Project 2024 07 18t130758.431

New Project 2024 07 18t130758.431

Puja Khedkar: ఐఏఎస్ పూజా ఖేద్కర్ పేరు ప్రస్తుతం వార్తల్లో ఎలా మార్మోగిపోతుందో తెలిసిందే. ఆమె నియామకంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పూజ తర్వాత ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు కష్టాల్లో పడ్డారు. తన తల్లి మనోరమ ఖేడ్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక రైతును బెదిరించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. పుణె పోలీసులు తన పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భూవివాదానికి సంబంధించి కొందరిని తుపాకీ చూపుతూ బెదిరించిన పూజా తల్లి మనోరమ ఖేద్కర్‌పై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని హోటల్‌లో బస చేసిన ఆమెను అరెస్టు చేసినట్లు పూణే పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమెను పూణెకు తీసుకువస్తున్నారు.

Read Also:Darling : నిరంజన్ రెడ్డికి జాక్ పాట్..రిలీజ్ కు ముందే భారీ లాభాలు

వివాదాస్పద అధికారి పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో భూవివాదానికి సంబంధించి మనోరమ చేతిలో తుపాకీతో కొందరిని బెదిరించింది. ఈ వీడియో బయటకు రావడంతో మనోరమ, ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పూణే రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, ‘మేము ఆమెను మహద్‌లోని ఒక హోటల్ నుండి అదుపులోకి తీసుకున్నాము. ప్రస్తుతం పూణే తీసుకువస్తున్నారు. ఆమెను విచారించనున్నారు. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత తనను అరెస్ట్ చేయనున్నారు. ఈ కేసులో మనోరమ, ఆమె భర్త , మరో ఐదుగురు నిందితుల కోసం అనేక బృందాలు ఏర్పాటయ్యాయి.

Read Also:Mallu Bhatti Vikramarka: లీడ్ బ్యాంకులు లోన్ల విషయంలో ఎక్కడ అశ్రద్ధ చూపొద్దు..

2023 బ్యాచ్ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పుణెలో ప్రొబేషన్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రొబేషన్‌ అధికారులకు అందని ఎన్నో ప్రత్యేకాధికారాలను ఆయన డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఐఏఎస్ పూజా తన వ్యక్తిగత ఆడి కారును ఉపయోగించింది. మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌ను కలిగి ఉంది. ఎరుపు రంగు బల్బ్ కూడా ఉంది. ఐఏఎస్ ఖేద్కర్‌కు పూణే సిటీ ట్రాఫిక్ పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. వాహనంపై అనధికారిక రెడ్ బీకాన్ ఉపయోగించడం.. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రస్తావన కోసం నోటీసు ఇచ్చారు. పోలీసుల విచారణలో లగ్జరీ ఆడి కారు ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కంపెనీ పేరిట రిజిస్టర్ అయినట్లు తేలింది. కంపెనీకి చెందిన ఈ వాహనంపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై 21 ఫిర్యాదులు రాగా రూ.27 వేలు జరిమానా విధించారు. అయితే పూణె పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ప్రశ్న తలెత్తుతోంది. దొంగతనం కేసులో అరెస్టయిన వ్యక్తిని విడుదల చేయాలని ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ డీసీపీ ర్యాంక్ అధికారిపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని నవీ ముంబై పోలీసులు మహారాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.