Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ias Amit Kataria Draws Only One Rupee Per Month Salary

Amit Kataria: దేశంలో ధనిక ఐఏఎస్ అధికారుల్లో ఒకరు.. జీతం నెలకు రూ.1 మాత్రమే..

Published Date :November 10, 2024 , 4:26 pm
By RAMAKRISHNA KENCHE
  • నెలకు కేవలం రూ.1 మాత్రమే జీతం తీసుకునే ఐఏఎస్
  • ఆయనే హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన అమిత్ కటారియా
  • ఆయన కుటుంబానికి భారీ వ్యాపారాలు
  • ఆస్తుల విలువ రూ. 8.80 కోట్లు
Amit Kataria: దేశంలో ధనిక ఐఏఎస్ అధికారుల్లో ఒకరు.. జీతం నెలకు రూ.1 మాత్రమే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో ఎందరో ఐఏఎస్-ఐపీఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఐఏఎస్ అధికారుల్లో పేరున్న ఐఏఎస్ అధికారి ఒకరు ఉన్నారు. ఆయన నెలకు రూ.1 జీతం మాత్రమే తీసుకోవడం విశేషం. ఆయన పేరు అమిత్ కటారియా. ఆయన నికర విలువ కోట్లలో ఉంటుంది. ఐఏఎస్ అమిత్ కటారియా హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌కి బదిలీ అయ్యారు. ఆయన సుమారు 7 సంవత్సరాల తర్వాత సెంట్రల్ డిప్యుటేషన్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన కుటుంబం గుర్గావ్‌లో నిర్మాణ కంపెనీలను కలిగి ఉంది.

ఆయన నికర విలువ..
అమిత్ కటారియా కుటుంబానికి పెద్ద రియల్ ఎస్టేట్, నిర్మాణ వ్యాపారం ఉంది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వారి వ్యాపారం విస్తరించింది. ఈ వ్యాపారాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా వారు భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. జూలై 2023 నాటికి కటారియా ఆస్తుల విలువ రూ. 8.80 కోట్లు. అయితే.. టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి అలవెన్స్‌లు మినహా ఐఏఎస్ అధికారులు నెలకు రూ.56,100 ప్రారంభ వేతనం పొందుతారు. క్యాబినెట్ సెక్రటరీకి, ఈ జీతం నెలకు రూ. 2,50,000 వరకు చేరవచ్చు. ఇది ఐఏఎస్ అధికారికి అత్యున్నత పదవి. ఐఏఎస్‌ అధికారులు గ్రేడ్ పే అని పిలువబడే అదనపు చెల్లింపును కూడా అందుకుంటారు. ఇది వారి పోస్ట్‌ను బట్టి మారుతుంది.

ఢిల్లీలో ప్రాథమిక విద్య.. 

కానీ ఆయన మాత్రం రూ.1 మాత్రమే జీతం తీసుకుంటున్నారు. ఢిల్లీలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 2003 సంవత్సరంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 18వ ర్యాంక్‌ను సాధించారు. ఇది కాకుండా.. ఆయన ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి. అక్కడ B.Tech డిగ్రీని పూర్తి చేశారు. అయితే.. ఐఏఎస్ అమిత్ కటారియా జీతం లక్షల్లో ఉన్నా.. కేవలం రూ.1 మాత్రమే జీతంగా తీసుకోవడంపై చర్చ సాగుతోంది. అమిత్ కటారియా భార్య అస్మితా హండా కూడా వాణిజ్య పైలట్, ఆమె జీతం కూడా లక్షల్లో ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • country
  • IAS Amit Kataria
  • IAS Amit Kataria draws only one rupee
  • ias officer
  • richest IAS officers

తాజావార్తలు

  • Jowar Ambali Recipe: ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే హెల్తీ, టేస్టీ డ్రింక్.. పాత పద్దతిలో జొన్న అంబలి..

  • YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

  • RaashiKhanna : బ్లాక్ డ్రెస్ లో ముద్దొస్తున్న రాశి ఖన్నా

  • India Advisory Iran: “వెంటనే బయలుదేరండి”.. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక హెచ్చరిక..

  • AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions