NTV Telugu Site icon

Amit Kataria: దేశంలో ధనిక ఐఏఎస్ అధికారుల్లో ఒకరు.. జీతం నెలకు రూ.1 మాత్రమే..

Amit Kataria

Amit Kataria

దేశంలో ఎందరో ఐఏఎస్-ఐపీఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఐఏఎస్ అధికారుల్లో పేరున్న ఐఏఎస్ అధికారి ఒకరు ఉన్నారు. ఆయన నెలకు రూ.1 జీతం మాత్రమే తీసుకోవడం విశేషం. ఆయన పేరు అమిత్ కటారియా. ఆయన నికర విలువ కోట్లలో ఉంటుంది. ఐఏఎస్ అమిత్ కటారియా హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తి. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌కి బదిలీ అయ్యారు. ఆయన సుమారు 7 సంవత్సరాల తర్వాత సెంట్రల్ డిప్యుటేషన్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన కుటుంబం గుర్గావ్‌లో నిర్మాణ కంపెనీలను కలిగి ఉంది.

ఆయన నికర విలువ..
అమిత్ కటారియా కుటుంబానికి పెద్ద రియల్ ఎస్టేట్, నిర్మాణ వ్యాపారం ఉంది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వారి వ్యాపారం విస్తరించింది. ఈ వ్యాపారాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా వారు భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. జూలై 2023 నాటికి కటారియా ఆస్తుల విలువ రూ. 8.80 కోట్లు. అయితే.. టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి అలవెన్స్‌లు మినహా ఐఏఎస్ అధికారులు నెలకు రూ.56,100 ప్రారంభ వేతనం పొందుతారు. క్యాబినెట్ సెక్రటరీకి, ఈ జీతం నెలకు రూ. 2,50,000 వరకు చేరవచ్చు. ఇది ఐఏఎస్ అధికారికి అత్యున్నత పదవి. ఐఏఎస్‌ అధికారులు గ్రేడ్ పే అని పిలువబడే అదనపు చెల్లింపును కూడా అందుకుంటారు. ఇది వారి పోస్ట్‌ను బట్టి మారుతుంది.

ఢిల్లీలో ప్రాథమిక విద్య.. 

కానీ ఆయన మాత్రం రూ.1 మాత్రమే జీతం తీసుకుంటున్నారు. ఢిల్లీలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 2003 సంవత్సరంలో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 18వ ర్యాంక్‌ను సాధించారు. ఇది కాకుండా.. ఆయన ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి. అక్కడ B.Tech డిగ్రీని పూర్తి చేశారు. అయితే.. ఐఏఎస్ అమిత్ కటారియా జీతం లక్షల్లో ఉన్నా.. కేవలం రూ.1 మాత్రమే జీతంగా తీసుకోవడంపై చర్చ సాగుతోంది. అమిత్ కటారియా భార్య అస్మితా హండా కూడా వాణిజ్య పైలట్, ఆమె జీతం కూడా లక్షల్లో ఉంది.

Show comments