Site icon NTV Telugu

Janhvi Kapoor: నిజమే.. వారి డ్రెస్సింగ్‌ స్టైల్‌ని కాపీ కొట్టా: జాన్వీ కపూర్‌

Janhvi Kapoor Red Dress

Janhvi Kapoor Red Dress

Janhvi Kapoor React on Copying Zendaya Fashion Style: జాన్వీ కపూర్‌ సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్‌తోనే ఫేమస్ అయ్యారు. తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు. మోడ్రన్ డ్రెస్ వేసినా.. చీర కట్టినా జాన్వీ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తనకు సంబదించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అభిమానులను అలరిస్తుంటారు. నెట్టింట చురుగ్గా ఉండే జాన్వీ.. మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకున్నారు. నిత్యం ట్రెండీ డ్రెస్‌లతో అలరించే జూనియర్ శ్రీదేవి.. తన కొత్త సినిమా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో మరింతగా రెచ్చిపోయారు. వెరైటీ డ్రెస్‌, శారీలో ప్రమోషన్స్‌ చేస్తున్నారు.

‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో భాగంగా దిగిన స్టిల్స్‌ని జాన్వీ కపూర్‌ తన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. అందులో రెడ్‌ కలర్‌ డ్రెస్సు స్టిల్స్‌ వైరల్‌గా మారాయి. అయితే ఆ డ్రెస్సు గతంలో బిగ్‌బాస్‌ ఫేమ్ ఉర్ఫీ జావేద్‌ ధరించిన ఓ డ్రెస్సును పోలి ఉంది. దాంతో ఓ నెటిజన్‌ జాన్వీని ఫ్యాషన్‌ గురించి ప్రశ్నించాడు. హాలీవుడ్‌ నటి జెండయా, ఉర్ఫీ జావేద్‌ ఫ్యాషన్‌ స్టైల్‌ని కాపీ చేశారా? అని అడగ్గా అవునని సమాధానమిచ్చారు.

Also Read: Janhvi Kapoor: మరో క్రేజీ శారీలో జాన్వీ కపూర్.. అందరి కళ్లు బ్లౌజ్‌పైనే!

‘జెండయా తన ఛాలెంజర్స్‌ సినిమా కోసం చేసిన ప్రమోషన్స్‌ నాకు ప్రేరణ. ఉర్ఫీ జావేద్‌ ఫ్యాషన్‌ చాలా క్రియేటివ్‌గా ఉంటుంది. ఏదైనా సినిమాని ప్రమోట్‌ చేసేటప్పుడు.. అందులో నటించిన పాత్రకు తగ్గ డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఉండాలని నెను భావిస్తా. అందుకే ఈ స్టైల్‌ మెయింటైన్ చేస్తున్నా’ అని జాన్వీ కపూర్‌ సదరు నెటిజన్‌కు సమాధానం ఇచ్చారు. క్రికెట్‌ నేపథ్యంలో డైరెక్టర్ శరణ్‌ శర్మ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ని తెరకెక్కించారు. ఈ సినిమా మే 31న సినిమా విడుదల కానుంది.

Exit mobile version