Site icon NTV Telugu

Namansh Syal: తండ్రి ఆర్మీ రిటైర్డ్.. భార్య ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్.. దుబాయ్ ఎయిర్ షోలో అమరుడైన వింగ్ కమాండర్ కథ..

Iaf

Iaf

Commander Namansh Syal: దుబాయ్‌లో జరిగిన వైమానిక ప్రదర్శన సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. ఈ సంఘటనపై భారత వైమానిక దళం విచారం వ్యక్తం చేసింది.. అమరుడైన వింగ్ కమాండర్ నమాంశ్‌ స్యాల్‌ (34) గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బాగ్వాన్ ప్రాంతం పాటియాలాకాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి. శుక్రవారం మధ్యాహ్నం వింగ్ కమాండర్ నమాంశ్‌ స్యాల్‌ అమరులయ్యారనే వార్తతో గ్రామం విషాదంలో మునిగిపోయింది.

READ MORE: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

వింగ్ కమాండర్ స్యాల్ హైదరాబాద్ ఎయిర్ బేస్‌లో నియమితులయ్యారు. ఆయన క్రమశిక్షణ, అద్భుతమైన సేవా రికార్డుకు ప్రసిద్ధి చెందారు. అతడి భార్య అఫ్సాన్ సైతం భారత వైమానిక దళ అధికారిణిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల కుమార్తె ఉంది. అంతే కాదు.. స్యాల్ తండ్రి జగన్ నాథ్ రిటైర్డ్ ఆర్మీ అధికారి. పదవీ విరమణ తర్వాత జగన్ నాథ్ హిమాచల్ ప్రదేశ్ విద్యా శాఖలో ప్రిన్సిపాల్ అయ్యారు. ఆయన భార్యతో కలిసి అక్కడే ఉంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన తల్లి బినా దేవి తన కొడుకు, కోడలిని చూడటానికి హైదరాబాద్‌కి వచ్చారు. తన కుమారుడిని బతికున్నప్పుడు చివరి చూపు చూడలేకపోయింది ఆ తల్లి.. కుమారుడు మరణించినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం గర్వపడుతున్నారు.

READ MORE: Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో సెలబ్రిటీలపై కొనసాగుతున్న సిట్ విచార

ఈ ఘటనపై ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది. ‘‘దుబాయ్‌ ఎయిర్‌షోలో తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందడం దిగ్భ్రాంతికరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కష్టసమయంలో పైలట్‌ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతాం’’ అని వాయుసేన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో యుద్ధ విమానం ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Exit mobile version