Minister Ushasri Charan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్నికి కట్టుబడి ఉంటాం అని స్పష్టం చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్.. పెనుకొండ బాధ్యతలు తీసుకోవాలని అధిష్టానం నాకు సూచించిందన్న ఆమె.. వచ్చే ఎన్నికల్లో తాను పెనుకొండ నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటించారు.. కళ్యాణదుర్గంలో బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బరిలో ఉండబోతున్నారని తెలిపారు. అయితే, అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాను పెనుకొండ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: VC Sajjanar: ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన ఆటోడ్రైవర్లు.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్
వచ్చే ఎన్నికల్లో నేను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నా.. అధిష్టానం నుంచి నాకు ఆ దిశగా ఆదేశాలు వచ్చాయన్నారు ఉషశ్రీ చరణ్.. సీఎం జగన్ ఆదేశించారు.. ఆయన నిర్ణయం స్వాగతిస్తున్నా.. ఆదేశాలు పాటిస్తాను.. నేను పెనుకొండ వెళ్తున్నాను అన్నారు. ఇన్ని రోజులు కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో ఆదరించారు.. వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను.. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను అన్నారు. సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగానే మార్పు ఉంటుందన్నారు. మేం ఎక్కడికి వెళ్లినా.. ఒక్కటే నినాదం.. అది జగన్ నినాదం.. ప్రజలు ఎక్కడైనా సరే జగన్ ని, ఫ్యాన్ గుర్తునే చూస్తున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా.. సీఎం వైఎస్ జగన్‌ను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని తెలిపారు మంత్రి ఉషశ్రీ చరణ్. కాగా, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార వైసీపీ పలు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తూ వస్తుంది.. అందులో పలువురు మంత్రులకు కూడా స్థానచలనం తప్పడం లేదు.