Vijay Sethupathi : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాడు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,విలన్ గా ,హీరోగా వరుస సినిమాలు చేసి ఎన్ని సూపర్ హిట్స్ అందుకున్నాడు.ఈ నటుడు తెలుగులో కొత్త దర్శకుడు బుచ్చి బాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చి బాబు ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో ఉప్పెన సినిమా తెరకెక్కించాడు.ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు.అలాగే క్యూట్ బ్యూటీ కృతి శెట్టి కూడా ఈ సినిమాతోనే టాలీవుడ్ కి పరిచయం అయింది .
Read Also :Sameera Reddy: అవి పెంచే సర్జరీ కోసం బలవంతం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సమీరా రెడ్డి
ఈ సినిమాలో విజయ్ సేతుపతి రాయనం అనే పాత్రలో అద్భుతంగా నటించారు.హీరోయిన్ కి తండ్రిగా విజయ్ సేతుపతి నటన పేక్షకులకు విపరీతంగా నచ్చింది.స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి తండ్రిగా ,విలన్ గా అద్భుతంగా నటించి మెప్పించారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి విజయ్ సేతుపతి ఆసక్తికర విషయాలు తెలియజేసారు.సినిమా పట్ల డైరెక్టర్ బుచ్చిబాబుకు ఎంతో ప్యాషన్ వుంది.ఆయన కోసమే ఉప్పెన సినిమా చేశాను అని విజయ్ సేతుపతి తెలిపారు.సాధారణంగా నాలాంటి నటులు తండ్రి పాత్ర చేయడానికి ముందుకు రారు.కానీ అతడు కథ చెప్పే విధానం ,అలాగే డైలాగ్స్ రాసుకున్న పద్ధతి నాకు బాగా నచ్చాయి.అందుకే ఆ పాత్ర చేశాను.అలాగే బుచ్చి బాబు కొత్త దర్శకుడు కావడంతో ఆ సినిమాకు చాల తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు