NTV Telugu Site icon

Ashraf Ahmed: రెండు వారాల్లో చంపేస్తారు.. ఓ అధికారి బెదిరించాడని అష్రఫ్ ఆరోపణలు

Ashraf Ahmed

Ashraf Ahmed

Ashraf Ahmed: గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ అహ్మద్ సోదరుడు సంచలన ఆరోపణలు చేశాడు. ఓ అధికారి తనను రెండు వారాల్లో చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. 2006 ఉమేష్ పాల్ అపహరణ కేసులో నిర్దోషులుగా విడుదలైన ఏడుగురిలో అష్రఫ్ అహ్మద్ ఒకరు. మంగళవారం అష్రాఫ్‌ను బరేలీ జైలుకు తరలించగా, అతిక్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించారు. తనను బరేలీ జైలుకు తరలిస్తుండగా, రెండు వారాల్లో జైలు నుంచి బయటకు తీసుకొచ్చి చంపేస్తానని ఓ సీనియర్ బెదిరించాడని అష్రఫ్ ఆరోపణలు చేశాడు. “రెండు వారాల్లో నన్ను జైలు నుండి బయటకు తీసుకువెళతానని, చంపేస్తానని ఒక అధికారి నన్ను బెదిరించాడు” అని అష్రఫ్ చెప్పాడు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఫేక్ కేసులు కూడా పెట్టారంటే తన బాధను అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.తనపై వచ్చిన ఆరోపణలు బూటకమని, ముఖ్యమంత్రిపై కూడా ఫేక్ కేసులు పెట్టడంతో తన బాధను సీఎం అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. అయితే ఆ అధికారి ఎవరని ప్రశ్నించగా.. తాను పేరు చెప్పలేనన్నాడు. తాను హత్యకు గురైతే ఒక ఎన్వలప్‌లో ఆ పేరు ముఖ్యమంత్రికి చేరుతుందని వ్యాఖ్యలు చేశాడు. బెదిరింపు గురించి అష్రాఫ్ మాట్లాడుతూ.. తనకు బెదిరింపు ఒక సీనియర్ అధికారి ఇచ్చారని, అతని పేరును ముఖ్యమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, అలహాబాద్ ప్రధాన న్యాయమూర్తికి కూడా వెల్లడిస్తానని చెప్పాడు.

Read Also: Wayanad Bypoll: వయనాడ్‌ ఉపఎన్నికపై స్పందించిన సీఈసీ.. అప్పుడే ఎన్నికలు!

2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైలులో ఉన్నాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. అయితే, రాజు పాల్‌ హత్య కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ 2006లో అపహరణకు గురై విడుదలయ్యాడు. 2007లో అతడు అతీక్‌తోపాటు పలువురిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశాడు. ఈ కేసు విచారణ చివరి రోజు (ఫిబ్రవరి 24, 2023)నే అతడు హత్యకు గురయ్యాడు. ఉమేశ్‌ పాల్ కేసు వేసిన వారిలో అష్రాఫ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసులో అతడు నిర్దోషిగా తేలాడు. అతీక్‌ అహ్మద్‌ను యూపీ ప్రయాగ్‌రాజ్‌ కోర్టు దోషిగా తేల్చింది. ప్రయాగ్‌రాజ్‌లోని కోర్టు 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్త అతిక్ అహ్మద్, మరో ఇద్దరిని మంగళవారం దోషులుగా నిర్ధారించింది. వారికి జీవిత ఖైదు విధించింది. అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్‌తో పాటు మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

Show comments