Site icon NTV Telugu

Graeme Swann: ఆస్ట్రేలియాను ఓడిస్తే నాకు చూడాలి ఉంది..

Swann

Swann

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టి (బుధవారం) నుంచి 11 వరకు జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ సిరీస్ ముగియనుంది. ఇక లండన్‌ లోని ఓవల్ స్టేడియం వేదికగా జరగన్న తుదిపోరులో భారత్‌- ఆస్ట్రేలియా తాడోపేడో తెల్చుకోనేందుకు సిద్దమయ్యాయి. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Read Also: Strange incident: భూపాలపల్లిలో వింత ఘటన.. ఇళ్లలో అకస్మాత్తుగా మంటలు

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ విజయం సాధిస్తే సెలబ్రేట్‌ చేసుకునేందుకు తాను సిద్దంగా ఉన్నాని గ్రేమ్ స్వాన్ అన్నాడు. ఓవల్‌ మైదానంలో ఇవాళ్టి నుంచి మ్యాచ్‌ జరగుతుంది.. కాబట్టి పిచ్‌ చాలా ఫ్లాట్‌గా ఉంటుందని.. పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో జియో సినిమాతో గ్రేమ్ స్వా్న్‌ మాట్లాడుతూ.. ఓవల్‌ పిచ్‌పై గ్రాస్‌ ఉండడంతో కచ్చితంగా పేసర్లకు అనుకూలిస్తుంది. బౌన్స్‌ కూడా ఎ‍క్కువగా ఉండే అవకాశం ఉంది అని తెలిపాడు.. ఓవల్‌ దాదాపు వాంఖడేలోని ఎర్ర మట్టి పిచ్‌ల మాదిరిగానే ఉంటుంది.. బౌన్స్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిల్లీ పాయింట్, షార్ట్-లెగ్ ఫీల్డర్‌లను తీసుకువస్తే బాగుంటుంది అని వెల్లడించాడు.

Read Also: Phone pe: ఫోన్ పే నుంచి ఈజీగా లోన్ ను ఎలా పొందాలో తెలుసా?

ఒక వేళ స్పిన్నర్లను ఆడించాలి అనుకుంటే టార్గెట్‌ డిఫెండ్‌ చేసుకోవడానికి భారీ స్కోర్‌ సాధించాలి అని గ్రేమ్ స్వామ్ అన్నారు. అయితే విజేతగా ఎవరు నిలుస్తురన్నది నేను ముందే ఊహించలేను.. ఎందుకంటే రెంటు జట్లు వరల్డ్‌ క్లాస్‌ టీమ్స్‌.. కానీ ఒక ఇంగ్లీష్‌ మ్యాన్‌గా ఈ ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియాను భారత్‌ ఓడిస్తే చూడాలని ఉంది.. ప్రస్తుత భారత జట్టులో కూడా అద్భుతమైన పేస్‌ బౌలర్లు ఉన్నారు.. కాబట్టి ఆసీస్‌కు కూడా తీవ్రమైన పోటీ తప్పదు అని గ్రేమ్ స్వాన్ పేర్కొన్నాడు.

Exit mobile version