Hyundai Verna SX+: హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తాజాగా తన ప్రముఖ సెడాన్ కార్ అయిన వెర్నాకు కొత్త SX+ వేరియంట్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వెర్షన్ మాన్యువల్, iVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో లభించనుంది. వినియోగదారులకు మెరుగైన, ఫీచర్-రిచ్ డ్రైవింగ్ అనుభవం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం అని కంపెనీ తెలిపింది. దీని ధర రూ. 13,79,300గా నిర్ణయించబడింది.
Read Also: Vivo T4 Ultra 5G: ప్రీమియం ఫీచర్లతో మళ్లీ రంగంలోకి వివో.. లాంచ్ కు ముహూర్తం ఖరారు..!
కొత్తగా ప్రవేశపెట్టిన వెర్ణా SX+ వెర్షన్‌లో పలు ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో Bose 8 స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, లెదర్ సీటింగ్, ముందు వెంచిలేటెడ్ అండ్ హీటెడ్ సీట్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, LED హెడ్‌లాంపులు మొదలైనవి దీనిలో ఉన్నాయి.
వెర్నా SX+ వెర్షన్‌తో పాటు, హ్యూండాయ్ మరో కీలక సాంకేతికను కూడా ప్రవేశపెట్టింది. అదే వైర్డ్ టు వైర్‌లెస్ అడాప్టర్. ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను వైర్‌లెస్ ద్వారా ఉపయోగించే సదుపాయాన్ని అందిస్తుంది. ఈ సాంకేతికతను ఇప్పుడు 7 మోడళ్లలో అందుబాటులోకి తెచ్చారు. గ్రాండ్ i10 నియోస్, ఎక్స్టర్, వెర్నా, ఔరా, వెన్యూ, వెన్యూ N లైన్, అల్కజార్ లలో అందుబాటులోకి తెచ్చారు. ఈ అడాప్టర్ వినియోగదారులకు మరింత సులభమైన, ఆధునిక కనెక్టివిటీ అనుభవం అందించేందుకు రూపొందించబడింది.
Read Also: IPL Chairman: ఆర్సీబీ విక్టరీ పరేడ్ గురించి నాకు తెలియదు..
గ్లోబల్ NCAP 5-స్టార్ రేటింగ్ పొందిన వెర్నా తన భద్రతా ప్రమాణాలతో పాటు.. ఆధునిక స్టైల్, సాంకేతికతలు, విస్తృత అంతర్గత ఏరియా, మంచి పనితీరు ద్వారా మార్కెట్లోకి వచ్చేసింది. ఇకపోతే, వెర్నాతో పాటు అలకజార్ మోడల్‌లో కూడా హ్యూండాయ్ కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా డీజిల్ ఇంజిన్‌తో కొత్త కార్పొరేట్ వేరియంట్ లభించనుంది. ఇందులో వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ సన్‌రూఫ్, 6-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి.
