NTV Telugu Site icon

Hyundai Santro : నయా లుక్ లో మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న హ్యుందాయ్ శాంట్రో

New Project (1)

New Project (1)

Hyundai Santro : హ్యుందాయ్ తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ శాంట్రోను న్యూ లుక్ లో విడుదల చేయనుంది. ఈ కారు స్టైలిష్ డిజైన్‌తో మాత్రమే కాకుండా ఆధునిక సాంకేతికత, అద్భుతమైన పర్ఫామెన్స్ తో కూడా వస్తుంది. ఇది బడ్జెట్ విభాగంలోముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసేవారి, యువతకు గేమ్-ఛేంజర్‌గా చెబుతుంటారు.

ఆకట్టుకునే ఎక్స్ టర్నల్ డిజైన్
కొత్త శాంట్రో డిజైన్‌లో పెద్ద మార్పు ఉంటుంది. దీని సిగ్నేచర్ క్యాస్కేడింగ్ గ్రిల్, స్వెప్ట్-బ్యాక్ LED హెడ్‌ల్యాంప్‌లు దీనికి అద్భుతమైన డిజైన్ అందించాయి. వెనుక భాగంలో LED టెయిల్ లైట్లు, స్పోర్టీ బంపర్‌లు దీన్ని మరింత ఎట్రాక్టివ్ గా చేశాయి. ఇది ఎలక్ట్రిక్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్ వంటి అద్భుతమైన కలర్స్ లలో రానుంది.

Read Also : Kumbh stampede: కుంభమేళా తొక్కిసలాటపై పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్ట్..

పవర్ ఫుల్ ఇంజిన్ తో కొత్త శాంట్రో
కొత్త శాంట్రో 83 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 1.1-లీటర్ ఎప్సిలాన్ ఇంజిన్‌తో పవర్ ఇవ్వనుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఆఫ్షన్లతో వస్తుంది. ఇది అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. దీని కారణంగా రోజు వారి వాడుకునే వారికి బెస్ట్ ఛాయిస్ కారుగా చెప్పొచ్చు.

ప్రీమియం ఇంటీరియర్స్, టెక్నాలజీ
కొత్త శాంత్రో క్యాబిన్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించవచ్చు, ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ చేస్తుంది. సౌకర్యవంతమైన సీటింగ్, తగినంత లెగ్‌రూమ్, USB పోర్ట్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్ దీనిని మరింత ప్రీమియంగా చేస్తాయి.

Read Also :Rahul Gandhi: యూపీఏ, ఎన్డీఏ పాలనపై రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు

కొత్త శాంట్రో సేఫ్టీ ఫీచర్స్
కొత్త శాంత్రోలో హ్యుందాయ్ సేఫ్టీ కోసం బాగా డిజైన్ చేశారు. ఇది డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి ప్రామాణిక సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. రివర్స్ కెమెరా, హిల్-స్టార్ట్ అసిస్ట్ కూడా అధిక ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటాయి.

కొత్త శాంట్రో అంచనా ధర
కొత్త శాంత్రో ప్రారంభ ధర దాదాపు రూ. 3.8 లక్షలు నుండి రూ. 6.5 లక్షల వరకు ఉండవచ్చు. ఈ కారు సరసమైన ధరకు ప్రీమియం ఫీచర్లను అందించడం ద్వారా బడ్జెట్ విభాగంలో సంచలనం సృష్టించగలదు. హ్యుందాయ్ కొత్త శాంట్రోను CNG, ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త హ్యుందాయ్ శాంట్రో ఆకర్షణీయమైన డిజైన్, మంచి పర్ఫామెన్స్, ఆధునిక ఫీచర్లతో రావచ్చు. ఇది బడ్జెట్ విభాగంలో ఖచ్చితంగా బెస్ట్ ఆఫ్షన్ గా నిలువనుంది.